Aranmanai 4 OTT: ఓటీటీలో తమన్నా, రాశీఖన్నాల అరణ్మనై-4.. అఫీషియల్ డేట్ ఇదిగో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మనై-4. తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ సిరీస్ 'అరణ్మనై ' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఈసారి తెలుగులో కూా బాక్ పేరుతో విడుదల చేశారు. గత నెల మే 3న థియేటర్లలో రిలీజైన అరణ్మనై 4 హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మనై-4. తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ సిరీస్ ‘అరణ్మనై ‘ నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఈసారి తెలుగులో కూా బాక్ పేరుతో విడుదల చేశారు. గత నెల మే 3న థియేటర్లలో రిలీజైన అరణ్మనై 4 హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాదదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. తెలుగులోనూ ఈ సినిమాకు గట్టిగానే ప్రమోషన్లు నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వంచి, భయ పెట్టిన అరణ్మనై-4 ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ హారర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మేరకు జూన్ 21 నుంచి అరణ్మనై-4 చిత్రాన్ని స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడించింది. అలాగే సోషల్ మీడియా ద్వారా సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
అరణ్మనై 4 చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నారు. డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కించిన ఈ సినిమాలో కేజీఎఫ్ రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగిబాబు, వీటీవీ గణేశ్, ఢిల్లీ గణేశ్, జయప్రకాశ్, ఫ్రెడ్రిక్ జాన్సన్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. అన్వి సినీమ్యాక్స్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. హిప్‍హాప్ తమిజా సంగీతం అందించారు. ఇక ఇందులోని అచ్చో అచ్చచ్చో అనే ప్రమోషనల్ సాంగ్ యూబ్యూట్ లో సెన్సేషనల్ అవుతోంది. సంగీత ప్రియులను తెగ అలరిస్తూ యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది.
21 నుంచి స్ట్రీమింగ్..
Oru semma Family entertainer!
Aranmanai 4 Streaming From June 21 On Disney +Hotstar#Aranmanai4 #StreamingFromJune21 #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/9rz8wBBqNx
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 5, 2024
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి..
விரைவில் 🔥
Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024
Code Word Accepted 😉
Aranmanai 4 Coming soon On Disney + Hotstar #Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/a6iZnBNZv1
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.