- Telugu News Photo Gallery Cinema photos Surekhavani And Her Daughter Supritha Celebrates Pawan Kalyan's Janasena Thumping Victory In Ap Assembly Elections
Surekhavani: పవన్ కల్యాణ్ విజయం.. కూతురితో కలిసి సురేఖ వాణి సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ జనసనే అభ్యర్తులు గెలుపొందారు. అలాగే 2 ఎంపీ సీట్లు సైతం జనసేన ఖాతాలో పడ్డాయి.
Updated on: Jun 05, 2024 | 5:30 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ జనసనే అభ్యర్తులు గెలుపొందారు. అలాగే 2 ఎంపీ సీట్లు సైతం జనసేన ఖాతాలో పడ్డాయి.

పవన్ కల్యాణ్, జనసేన విజయంలో మెగాభిమానులు, పార్టీ కార్యర్తలు, జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా పేల్చుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ఇక పలువురు సినీ ప్రముఖులు కూడా పవన్ కల్యాణ్ విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో ప్రముఖ సీనియర్ నటి సురేఖా వాణి కూడా ఉంది.

ఈ సందర్భంగా తన కూతురు సుప్రితతో కలిసి జనసేన జెండా పట్టుకుని సెలబ్రేషన్స్ చేసుకుంది సురేఖా వాణి. ఇందులో జనసేన టీ షర్ట్ తో కనిపించింది సుప్రిత.

సురేఖా వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో మరొక రీల్ షేర్ చేసింది. అందులో 'ఇక మనల్ని ఆపేది ఎవడ్రా' అనే పాటకు సరదాగా కాలు కదిపింది. ప్రస్తుతం సురేఖ వాణి, సుప్రితల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.