- Telugu News Photo Gallery Cinema photos Kajal Aggarwal and Kriti Shetty should get success in upcoming 2024 movies
ఒకే సమస్యతో బాధపడుతున్న.. కాజల్.. కృతి శెట్టి.. ఇంతకీ ఆ సమస్య ఏంటంటే ??
ప్రాజెక్ట్ కె... ఈ పేరు వినగానే... డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా గురించి అనుకునేరు. ఈ ప్రాజెక్ట్ కె ... ఆ ప్రాజెక్ట్ కె కాదండోయ్. ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నది కాజల్ అండ్ కృతి శెట్టి గురించి. ఒకరు బాగా సీనియర్.. మరొకరు సక్సెస్‌ఫుల్ జూనియర్. ఈ వారం ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్న ఇద్దరిదీ ఇప్పుడు ఒకటే సమస్య... ఇంతకీ ఏంటది? చూసేద్దాం పదండి... రీఎంట్రీలో కాజల్‌కి భారీ సినిమా ఇండియన్2 హెల్ప్ అవుతుందని అందరూ భావించారు.
Updated on: Jun 05, 2024 | 2:04 PM

ప్రాజెక్ట్ కె... ఈ పేరు వినగానే... డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా గురించి అనుకునేరు. ఈ ప్రాజెక్ట్ కె ... ఆ ప్రాజెక్ట్ కె కాదండోయ్. ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నది కాజల్ అండ్ కృతి శెట్టి గురించి. ఒకరు బాగా సీనియర్.. మరొకరు సక్సెస్‌ఫుల్ జూనియర్. ఈ వారం ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్న ఇద్దరిదీ ఇప్పుడు ఒకటే సమస్య... ఇంతకీ ఏంటది? చూసేద్దాం పదండి...

రీఎంట్రీలో కాజల్‌కి భారీ సినిమా ఇండియన్2 హెల్ప్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇండియన్2లో ఆమె ఉండరన్న విషయాన్ని డిక్లేర్ చేసేశారు కెప్టెన్ శంకర్. కమల్‌హాసన్‌తో కాజల్‌ని చూడాలంటే ఇండియన్3 రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో... ఇప్పటికిప్పుడు కాజల్ రీ ఎంట్రీలో ఏదో మేజిక్ జరగాలంటే సత్యభామ సక్సెస్ కావాల్సిందే.

ఈ నెల 7న విడుదల కానుంది సత్యభామ. గతంలో ఏ సినిమాకూ చేయనంతగా కాజల్ ప్రమోషన్లు షురూ చేశారు. సినిమాలో కంటెంట్ ఎలా ఉందో, ఈ ప్రమోషన్లు దానికి ఎంత హెల్ప్ అవుతాయో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. కాజల్ లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్న అదే రోజు మనమేతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు నటి కృతి శెట్టి.

ఫస్ట్ సినిమా ఉప్పెనతోనే జబర్దస్త్ ఫేమ్ తెచ్చుకున్న కృతి శెట్టి, తెలుగులో టాప్ హీరోయిన్‌గా టాప్ ప్లేసెస్‌కి రీచ్ అవుతారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. మధ్యలో కొన్ని ఒడుదొడుకులు ఎదురయ్యాయి.

వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెట్టి, ఆమె కోరుకునే సక్సెస్ మనమేతో వస్తుందా? ఉప్పెన రోజుల్ని కృతి ఫ్యాన్స్ మళ్లీ చూసే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. సో.. మిసెస్ కె.. కాజల్ అగర్వాల్, మిస్ కె కృతి శెట్టి... ఇద్దరూ ఈ వారం తమ ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరిస్తున్నారన్నమాట.




