- Telugu News Photo Gallery Cinema photos Pushpa 02 movie song with Allu Arjun and Rashmika Pushpa becoming latest sensation on internet
Pushpa 02: నెట్టింట్లో అల్లు అర్జున్, రష్మిక సరికొత్తగా హల్ చల్.. సరికొత్త రికార్డు సెట్ చేయనున్న పుష్ప కపుల్
ఎప్పుడూ ఒకేరకమైన రికార్డులు సెట్ చేస్తుంటే ఏం బావుంటుంది. అప్పుడప్పుడూ కొత్తగా చేయాలి. పక్కనోళ్లు మనల్ని చూసి ఫాలో అయ్యేలాగా చేయాలి. అప్పుడు కదా మజా వచ్చేది అని అంటోంది పుష్ప కపుల్. వాళ్ల ఆలోచనలకీ, ఇష్టాలకీ తగ్గట్టే నెట్టింట్లో సరికొత్తగా హల్ చల్ అవుతున్నారు. ఇంతకీ పుష్ప కపుల్ చేస్తున్న సందడేంటి? పుష్ప పుష్ప పుష్ప పుష్ప అంటూ... పుష్పరాజ్ మేనియా మరింత జోరందుకుంది. ఒక్కడే కష్టపడితే ఏం బావుంటుంది... వెంట నేనూ ఉంటా అంటూ కపుల్ సాంగ్‌తో గ్రౌండ్‌లోకి దిగేశారు రష్మిక మందన్న.
Updated on: Jun 05, 2024 | 1:53 PM

మ్యాగ్జిమమ్ నెలా, నెలన్నరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచే అసలు కథ మొదలు కానుంది. ఆల్రెడీ రెండు పాటలు ఓ టీజర్ వదిలిన పుష్ప 2 టీమ్, సెప్టెంబర్ నుంచి ప్రమోషన్స్ మీద సీరియస్‌గా ఫోకస్ చేయాలని నిర్ణయించింది.

పుష్ప పుష్ప పుష్ప పుష్ప అంటూ... పుష్పరాజ్ మేనియా మరింత జోరందుకుంది. ఒక్కడే కష్టపడితే ఏం బావుంటుంది... వెంట నేనూ ఉంటా అంటూ కపుల్ సాంగ్‌తో గ్రౌండ్‌లోకి దిగేశారు రష్మిక మందన్న.

ఈ నెలఖరు వరకు బ్రేక్ లేకుండా ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది చిత్రయూనిట్. ఈ షెడ్యూల్‌తో దాదాపు సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేస్తుంది. ఆగస్టులో మరో 15 రోజుల షూటింగ్‌తో పుష్ప 2కు గుమ్మడికాయ కొట్టేయనుంది యూనిట్.

పాట గురించి ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. రీసెంట్‌గా రిలీజ్ అయిన కపుల్ సాంగ్ లిరికల్ వీడియోలో చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమేనని అన్నారు.

దానికి తగ్గట్టుగానే కొరియోగ్రఫీ చేశానని అన్నారు. ఎనిమిది రోజులు ఈ సాంగ్ షూటింగ్ జరిగిందని అన్నారు. గణేష్ చెప్పిన మాటలు విన్న వారందరూ వెంటనే గేమ్ చేంజర్ గురించి కియారా చెప్పిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.




