AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs USA: సూపర్ 8పై కన్నేసిన భారత్, అమెరికా.. పాక్ చూపంతా ఈ మ్యాచ్‌పైనే..

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో నేడు టీమిండియా వర్సెస్ అమెరికా జట్లు పోటీపడతాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం (జూన్ 12) జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8 దశకు చేరుకుంటుంది. ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడంతో ఈరోజు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి తదుపరి దశకు చేరుకోవాలని ఇరుజట్లు ప్రయత్నిస్తుంటాయి.

IND vs USA: సూపర్ 8పై కన్నేసిన భారత్, అమెరికా.. పాక్ చూపంతా ఈ మ్యాచ్‌పైనే..
United States Vs India
Venkata Chari
|

Updated on: Jun 12, 2024 | 8:04 AM

Share

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో నేడు టీమిండియా వర్సెస్ అమెరికా జట్లు పోటీపడతాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం (జూన్ 12) జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8 దశకు చేరుకుంటుంది. ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడంతో ఈరోజు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి తదుపరి దశకు చేరుకోవాలని ఇరుజట్లు ప్రయత్నిస్తుంటాయి.

విశేషమేమిటంటే టీ20 క్రికెట్‌లో భారత్, అమెరికా జట్లు తలపడడం ఇదే తొలిసారి. ఇక్కడ భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ, USA వైపు నుంచి పోటీని కూడా ఆశించవచ్చు.

ఎందుకంటే గత మ్యాచ్‌లో అమెరికా జట్టు పాకిస్థాన్ జట్టును ఓడించి చరిత్ర లిఖించింది. తద్వారా భారత్‌పై కూడా అంతే ఉత్సాహంతో రంగంలోకి దిగనున్నారు. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ హోరాహోరీ పోరు చూడొచ్చు.

మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్ వర్సెస్ అమెరికా జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి ముందు 7.30 గంటలకు టాస్ పడనుంది.

స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో సహా స్టార్ నెట్‌వర్క్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే, డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లోనూ ఉచితంగా చూడవచ్చు.

రెండు జట్లు:

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

యూఎస్‌ఏ జట్టు: మోనాక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరీ అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్తుష్ కెంజిగే, సౌరభ్ నేట్రల్‌వాకర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టాయ్ జహంగీర్. సబ్‌లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్‌డేల్, యాసిర్ మొహమ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..