AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడుపుబ్బా నవ్వుకోడానికి రెడీనా? మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. అసలు మిస్ అవ్వద్దు

సాధారణంగా థియేటర్లలోనైనా, ఓటీటీలోనైనా శుక్రవారం నుంచే కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తాయి. మరీ ముఖ్యంగా ఓటీటీల్లో అయితే గురువారం అర్ధరాత్రి నుంచే సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో వారం మధ్యలోనే కొత్త సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుంటాయి.

కడుపుబ్బా నవ్వుకోడానికి రెడీనా? మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. అసలు మిస్ అవ్వద్దు
Paarijatha Parvam Movie
Basha Shek
|

Updated on: Jun 11, 2024 | 9:17 PM

Share

సాధారణంగా థియేటర్లలోనైనా, ఓటీటీలోనైనా శుక్రవారం నుంచే కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తాయి. మరీ ముఖ్యంగా ఓటీటీల్లో అయితే గురువారం అర్ధరాత్రి నుంచే సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో వారం మధ్యలోనే కొత్త సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుంటాయి. అలా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు మరికొన్ని గంటల్లో ఓ క్రేజీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే ఇటీవల థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న పారిజాత పర్వం. కిడ్నాప్‌ ఈజ్‌ ఎన్‌ ఆర్ట్‌’ అన్నది ఈ సినిమా క్యాప్షన్. దీనికి తగ్గట్టుగానే కిడ్నాప్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇందులో చైతన్య రావు, మాళవిక సతీశన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. మరో హీరోయిన్ శ్రద్ధాస్, కమెడియన్ సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. . ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన పారిజాత పర్వం సినిమా యావరేజ్ గా నిలిచింది. కిడ్నాప్ నేపథ్యానికి కాస్త క్రైమ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించిఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్‌ కంభంపాటి. ఈ సినిమాలో సునీల్, హర్ష కామెడీ బాగా వర్కవుట్ అయిందని రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన పారిజాత పర్వం సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో బుధవారం (జూన్ 12) నుంచి పారిజాత పర్వం సినిమా ఆహా ఓటీటీలో సందడి చేయనుంది. దీనికి సంబంధించి ఇదివరకే అధికారిక ప్రకటన వచ్చేసింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందన్నమాట.వనమాలి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మహీధర్ రెడ్డి, దేవేష్ సంయుక్తంగా పారిజాత పర్వం సినిమాను నిర్మించారు. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని మిస్ అయ్యారా? అయితే మరికొన్ని గంటల్లో ఆహాలోకి రానుంది. ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..