Paarijatha Parvam OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ కామెడీ మూవీ.. పారిజాత పర్వం ఎక్కడ చూడొచ్చంటే..
క్రైమ్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. సునీల్, హర్ష కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. క్రైమ్ కామెడీ జానర్ కావడంతో ఈ సినిమా చూసేందుకు అటు అడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో మంచి రివ్యూ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
ప్రస్తుతం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన మూవీస్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అందులో పారిజాత పర్వం ఒకటి. చైతన్య రావు, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ క్రైమ్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సునీల్ కీలకపాత్రలో నటించగా.. కంభంపాటి సంతోష్ దర్శకత్వం వహించారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. సునీల్, హర్ష కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. క్రైమ్ కామెడీ జానర్ కావడంతో ఈ సినిమా చూసేందుకు అటు అడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో మంచి రివ్యూ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
పారిజాత పర్వం కథ విషయానికి వస్తే.. ఈ మూవీ మొత్తం ఓ కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. ట్విస్టులు, సస్పెన్స్.. అలాగే కామెడీ సీన్స్ హైలెట్ అయ్యాయి. కిడ్నాప్ చేయడం ఓ కళ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పోస్టర్స్ ఆసక్తి కలిగించాయి. ఇందులో మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రోహిణి కీలకపాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆహాలో ప్రసన్న వదనం, 105 మినిట్స్, మిరల్, శ్రీరంగనీతులు, సిద్ధార్థ్ రాయ్, కాజల్ కార్తీక, అసురగురు లాంటి చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆహాలో పారిజాత పర్వం మూవీ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
Experience a thrill ride full of fun, suspense and excitement.
Watch #PaarijathaParvam only on #Aha ▶️https://t.co/LSBdl2JNrd@IamChaitanyarao #Sunil @shraddhadas43 @harshachemudu @malavika2831 @isantydirector @reebhatter @Vanamali_C @Mahidhar2003 @deveshhh @palaparthianan2… pic.twitter.com/AP5wFpD28M
— ahavideoin (@ahavideoIN) June 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.