AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కరీనా కపూర్, సైఫ్ పెళ్లిలో సర్వర్‏గా పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరో..

ఆ యంగ్ హీరో పేరే ఆసిఫ్ ఖాన్. ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన పంచాయత్ 3 సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రతి పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో స్థానం సంపాదించడానికి ఆసిఫ్ ఖాన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

Tollywood: కరీనా కపూర్, సైఫ్ పెళ్లిలో సర్వర్‏గా పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరో..
Actor
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2024 | 7:57 PM

Share

సినీ పరిశ్రమలో నటీనటులుగా రాణించాలంటే టాలెంట్ మాత్రమే కాదు.. అదృష్టం కూడా ఉండాలి. కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత కొందరికీ సరైన గుర్తింపు వస్తుంది. నటనపై ఆసక్తితో ఎంతో మంది సినీ రంగంలోకి అడుగుపెట్టి అనేక కష్టాలను ఎదుర్కొంటారు. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినా మరికొందరు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. సినిమాలు, సీరియల్స్ అంటూ వెండితెర, బుల్లితెరను ఏలేస్తున్నారు. ఇప్పుడు బీటౌన్‏లో ఓ యంగ్ హీరో పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పెళ్లిలో సర్వర్ గా పనిచేసిన ఆ అబ్బాయి.. ఇప్పుడు హీరోగా స్టార్ డమ్ అందుకున్నాడు. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ యంగ్ హీరో పేరే ఆసిఫ్ ఖాన్. ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన పంచాయత్ 3 సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రతి పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో స్థానం సంపాదించడానికి ఆసిఫ్ ఖాన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

పంచాయత్ 3 సిరీస్‌లోని అన్ని పాత్రలపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. సాచిజీ, రింకీ, ఖుష్బూ భాభి, క్రాంతి దేవితో పాటు ఫూలేరా అల్లుడు పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. నటుడు ఆసిఫ్ ఖాన్ ఫులేరా అల్లుడు గణేష్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సిరీస్ లో ఆసిఫ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘పంచాయత్ 3’ సిరీస్‌తో పాటు, ‘మీర్జాపూర్’ వంటి అనేక వెబ్ సిరీస్‌లలో ఆసిఫ్ చిన్న పాత్రలు పోషించాడు. కానీ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను చూశాడు.

చిన్న వయసులోనే తండ్రి మరణం.. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించడానికి అనేక ఉద్యోగాలు చేశాడు. ఆసిఫ్ ఖాన్ ఓ హోటల్‌లో వెయిటర్‌గా కూడా పనిచేశాడు. ఈ విషయాన్ని ఆసిఫ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “నా కష్టమైన రోజుల్లో ఓ హోటల్లో వెయిటర్ గా పనిచేశాను. అప్పుడు అదే హోటల్లో కరీనా, సైఫ్ రిసెప్షన్ జరిగింది. వారి రిసెప్షన్ లో నేను సర్వర్‌గా కూడా పనిచేశాను” అని అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు మాల్ లో పనిచేసినట్లు తెలిపాడు. అదే సినిమాల్లో సినిమాల్లో నటించేందుకు అడిషన్స్ కూడా ఇచ్చానని.. తర్వాత జైపూర్‌లోని థియేటర్ ట్రూప్‌లో చేరి .. తర్వాత క్యాస్టింగ్ అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినట్లు చెప్పుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Aasif Khan (@aasifkhan_1)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us