AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surekha Vani: సురేఖా వాణి పక్కన అంత క్లోజ్‌గా! ఇంతకీ ఇతనెవరో గుర్తు పట్టారా?

టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖావాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తల్లిగా, అక్కగా, సోదరిగా, అత్తగా.. ఇలా సపోర్టింగ్ రోల్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోందీ సీనియర్ నటి. అయితే గతంలో పోల్చితే ఈ మధ్యన పెద్దగా సినిమాలు చేయడం లేదామె. అయినా సురేఖా వాణీ పేరు తరచూ ఏదో ఒక రకంగా వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది

Surekha Vani: సురేఖా వాణి పక్కన అంత క్లోజ్‌గా! ఇంతకీ ఇతనెవరో గుర్తు పట్టారా?
Actress Surekha Vani
Basha Shek
|

Updated on: Jun 11, 2024 | 10:16 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖావాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తల్లిగా, అక్కగా, సోదరిగా, అత్తగా.. ఇలా సపోర్టింగ్ రోల్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోందీ సీనియర్ నటి. అయితే గతంలో పోల్చితే ఈ మధ్యన పెద్దగా సినిమాలు చేయడం లేదామె. అయినా సురేఖా వాణీ పేరు తరచూ ఏదో ఒక రకంగా వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా. నెట్టింట ఆమెతో పాటు కూతురు సుప్రిత షేర్ చేసే ఫొటోలు, వీడియోలు తెగ వైరలవుతుంటాయి. వీటికి నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తుంటాయి. ఆ మధ్యన టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ సురేఖా వాణి పేరు వినిపించింది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిందామె. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సురేఖా వాణి తాజాగా ఇన్ స్టాలో ఒక ఫొటో షేర్ చేసింది. అందులో బాలీవుడ్ ఫేమస్ స్టార్ ఓరీ అవ్రతమణితో కలిసి పోజులిచ్చింది. అయితే ఓరీ గురించి తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు. దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు సురేఖా వాణితో అంత క్లోజ్ గా ఉన్నాడు.. ఎవరబ్బా అంటూ అతని గురించి ఆరా తీస్తున్నారు.

ఓరీ అవత్రమని.. సింపుల్‌గా ‘ఓరీ’ అని పిలుస్తుంటారు. తెలుగు జనాలకు ఇతని గురించి పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం ఓరీ చాలా ఫేమస్. ముఖ్యంగా స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్, ఆర్యన్ ఖాన్ (షారుఖ్‌ ఖాన్ కుమారుడు), నైసా దేవగన్ ( అజయ్ దేవ్ గణ్ 4కాజోల్ కూతురు), అనన్య పాండే.. ఇలా వీళ్లందరికీ ఓరీ బెస్ట్ ఫ్రెండ్. ఇక బాలీవుడ్ లో ఏ పార్టీ జరిగినా ఓరీ ఉండాల్సిందే. ఇక ఓరీతో ఫొటో దిగాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని అఅతనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఓరీ ఇంతగా ఫేమస్ అవ్వడానికి అతను ఏం చేస్తుంటాడని అందరి ప్రశ్న. ఓరీ ఒక ఫ్యాషన్ డిజైనర్ కమ్ ఈవెంట్ మేనేజర్ కూడా. మరి సురేఖావాణి, ఓరీ ఎక్కడ ఎప్పుడు కలిశారనే విషయాలు మాత్రం తెలియడం లేదు. హైదరాబాద్ లేదా ముంబయిలో జరిగిన ఓ పార్టీలో వీరిద్దరు కలిసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ జనసేన గెలుపును పురస్కరించుకుని సురేఖా వాణి సంబరాలు.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.