Kumari Aunty: బిగ్‌బాస్‌లోకి కుమారి ఆంటీ! ‘ఎక్స్‌ట్రా’ ఎంటర్‌టైన్మెంట్‌తో ఆడియెన్స్‌కు పండగే
కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది. ఎంతలా అంటే నెట్టింట కుమారీ ఆంటీ వీడియోలను చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందలాది మంది క్యూ కట్టారు.

కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది. ఎంతలా అంటే నెట్టింట కుమారీ ఆంటీ వీడియోలను చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందలాది మంది క్యూ కట్టారు. అయితే జనాల రద్దీ పెరగడం, వాహనాల రాకపోకలను ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారీ ఆంటీ బిజినెస్ ను క్లోజ్ చేయించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఆమె ఫుడ్ బిజినెస్ హోటల్ ను ఓపెన్ చేయించారు. దీంతో కుమారీ ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఇదే అదనుగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఇప్పటికే పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారీ ఆంటీ. అదే సమయంలో ఆమెపై ట్రోల్స్ కూడా నడిచాయి. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారీ ఆంటీనీ మీ క్రేజ్ తో బిగ్ బాస్ పంపించేలా ఉన్నారంటూ నెట్టింట పోస్టులు కూడా దర్శన మిచ్చాయి. అయితే ఇప్పుడీ మాటలే నిజమయ్యేట్లు ఉన్నాయి.
ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌజ్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్ లో ఉన్న కుమారీ ఆంటీని ఎలాగైనా హౌజ్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తుందట. ఇందుకోసం ఆమెకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉందంటూ సమాచారం. మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తుందో రాదో తెలియాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








