Hardik Pandya: ఫాదర్స్ డే స్పెషల్.. కుమారుడితో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో చూశారా?

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ తండ్రులతో ఉన్న రిలేషన్ షిప్ ను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు షేర్ చేస్తున్నారు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు

Hardik Pandya: ఫాదర్స్ డే స్పెషల్.. కుమారుడితో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో చూశారా?
Hardik Pandya
Follow us

|

Updated on: Jun 16, 2024 | 9:27 PM

ఇవాళ నాన్నల దినోత్సవం కావడంతో అందరూ తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ అటూ తండ్రితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ తండ్రులతో ఉన్న రిలేషన్ షిప్ ను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు షేర్ చేస్తున్నారు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. తన కుమారుడు అగస్త్యతో స్పెషల్ మూమెంట్స్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఇందులో హార్దిక్ పాండ్యా కుమారుడితో కలిసి ఆడుకోవడం, నవ్వుకోవడం, ముచ్చట్లు చెప్పడం, బుజ్జి బుజ్జి మాటలు నేర్పించడం.. ఇలా ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ను ఈ వీడియోలో మనం చూడచ్చు. ఇందులో హార్దిక్ కంటే అతని కుమారుడు అగస్త్య ఎంతో అందంగా కనిపించాడు. అతని క్యూట్ లుక్స్, స్మైల్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

ఫాదర్స్ డే సందర్భంగా హార్దిక్ పాండ్యా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు తండ్రీ కొడుకుల అనుబంధం ఇలాగే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ లో ఘోరంగా విఫలమైన హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ లో మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో మొత్తం 7 వికెట్లు పడగొట్టి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ​లో 2 కీలక వికెట్లు తీసి గేమ్ ను భారత్ వైపు తిప్పాడు. అయితే ఇప్పటివరకు బ్యాటింగ్ పరంగా పెద్దగా అతనికి అవకాశాలు రాలేదు. సూపర్-8, సెమీస్‌లోనూ పాండ్యా కీలకం కానున్నాడు.

కుమారుడు అగస్త్యతో హార్దిక్ పాండ్యా… వీడియో ఇదిగో..

 ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా..

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles