IND vs SA: సఫారీలపై సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన.. దెబ్బకు రికార్డులు బద్దలు కొట్టిందిగా!

భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన స్మృతి 116 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసింది.

IND vs SA: సఫారీలపై సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన.. దెబ్బకు రికార్డులు బద్దలు కొట్టిందిగా!
Smriti Mandhana
Follow us

|

Updated on: Jun 16, 2024 | 7:26 PM

భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన స్మృతి 116 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసింది. ఓవరాల్ గా మొత్తం 127 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ తో 117 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మంధానకు ఇది 6వ సెంచరీ. ఈ సెంచరీ ఇన్నింగ్స్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో స్మృతి 7000 పరుగుల రికార్డు సృష్టించింది. భారత మహిళల జట్టులో ఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణి కూడా. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టుకు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 15 పరుగులకు చేరుకునే వరకు ఓపెనర్ షఫాలీ వర్మ (7 పరుగులు) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం హేమలత కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 10 పరుగులకే నిష్ర్కమించింది. దీంతో టీమిండియా కేవలం 53 పరుగులకే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇక్కడి నుంచి స్మృతికి జతకలిసిన జెమీమా రోడ్రిగ్స్ (17 పరుగులు) కాసేపు సహకారం అందించి జట్టు స్కోరు 90 దాటింది. ఈసారి సిక్సర్ కొట్టే ప్రయత్నంలో జెమీమా క్యాచ్ పట్టి ఔటైంది. అనంతరం వచ్చిన రిచా ఘోష్ 3 పరుగులకే తన ఇన్నింగ్స్ ముగించింది. దీంతో మరోసారి జట్టు కష్టాల్లో పడింది. కానీ 7వ స్థానంలో వచ్చిన దీప్తి శర్మ 37 పరుగుల ఇన్నింగ్స్ ఆడి స్మృతితో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత స్మృతి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.

8వ ప్లేస్ లో వచ్చిన పూజ స్మృతికి బాగా సపోర్ట్ చేయడమే కాకుండా జట్టు స్కోరును డబుల్ సెంచరీ మార్కును దాటేసింది. వీరిద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యం కూడా ఏర్పడింది. ఈ సమయానికి, స్మృతి 93 పరుగుల వద్ద ఉంది. తరువాతి బంతికి ఒక భారీ సిక్సర్, సింగిల్‌ను కొట్టి తన సెంచరీని పూర్తి చేసింది. చివరికి 127 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 117 పరుగులు చేసి స్మృతి తన వికెట్‌ను కోల్పోయింది. చివరకు భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. దీంతో ఆఫ్రికా జట్టుకు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇవి కూడా చదవండి

రెండు జట్లు

దక్షిణాఫ్రికా జట్టు:

లారా వోల్‌వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బాష్, సునే లూస్, మరిజాన్నె కెప్, అన్నేరీ డెర్క్‌సెన్, నందుమిసో షాంగసే, సినాలో జఫ్తా, మసాబటా క్లాస్ అయాబొంగా ఝాకా, నంకులులేకో మ్లాబా

టీమ్ ఇండియా:

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, డి హేమలత, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, ఎస్. ఆశా, రేణుకా సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles