AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాహ్నవి ప్రాణానికి వెల కట్టలేరు.. కానీ అక్షరాలా రూ. 262 కోట్ల పరిహారం!

జాహ్నవి ప్రాణానికి వెల కట్టలేరు.. కానీ అక్షరాలా రూ. 262 కోట్ల పరిహారం!

Samatha J
|

Updated on: Feb 14, 2026 | 1:55 PM

Share

అమెరికాలోని సియాటిల్‌లో పోలీసు నిర్లక్ష్యం కారణంగా మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి సియాటిల్ ప్రభుత్వం రూ. 262 కోట్లు (29 మిలియన్ డాలర్లు) పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించింది. ఈ పరిహారంపై కుటుంబం తరపు అటార్నీ నుండి ఇంకా స్పందన రాలేదు. ఈ కేసులో ఇది కీలక పరిణామం.

అమెరికాలోని సియాటిల్‌లో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సియాటిల్ ప్రభుత్వం జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 262 కోట్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. 2023 జనవరి 23న జాహ్నవి రోడ్డు దాటుతుండగా, పోలీస్ అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్న పెట్రోలింగ్ వెహికల్ అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన తర్వాత, ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డేవ్ బాడీ క్యామ్‌లో రికార్డ్ అయిన కొన్ని మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. జాహ్నవి మృతిపై జోకులు వేస్తూ, “ఆమెకు విలువలెదు. మహా అయితే 11,000 డాలర్స్ అంతే” అని కెవిన్ అన్న మాటలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాలోనూ విమర్శలు వెల్లువెత్తడంతో కెవిన్ డేవ్ ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?