AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OYO: లవర్‌తో ఓయోకి వెళ్లినప్పుడు పోలీసులు వస్తే ఏం చేయాలి.? చట్టం చెబుతున్నది ఇదే..

ఓయో రూమ్‌లో ఉండగా పోలీసుల రైడ్‌ చేసినప్పుడు.. మేజర్లుగా మీ చట్టపరమైన హక్కులు ఏంటి అనేది తెలుసుకోవాలి. 18 ఏళ్లు నిండినవారికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 కింద రైట్ టూ ప్రైవసీ రక్షణ కల్పిస్తుంది. పోలీసులు తల్లిదండ్రులకు కాల్ చేయమంటే అది కేవలం రిక్వెస్ట్ మాత్రమే. ఐడీ ప్రూఫ్ చూపించి..

OYO: లవర్‌తో ఓయోకి వెళ్లినప్పుడు పోలీసులు వస్తే ఏం చేయాలి.? చట్టం చెబుతున్నది ఇదే..
Oyo Room
Ravi Kiran
|

Updated on: Feb 14, 2026 | 3:29 PM

Share

అసలే ఇవాళ వాలెంటైన్స్ డే.. పైగా శనివారం, ఆదివారం.. వీకెండ్ కూడానూ. అదీ కాకుండా.. వాలెంటైన్స్ డే రోజున ఓయో రూమ్ బుకింగ్ ఏకంగా 70 శాతం పైగా పెరిగిందని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో మీరూ మీ లవర్‌తో ఓయో రూమ్‌కు వెళ్తున్నట్లయితే.. ఈ రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి. వివరాల్లోకి వెళ్తే.. మీరు మీ భాగస్వామితో ఓయో రూమ్‌కు వెళ్ళినప్పుడు, అనుకోకుండా పోలీసులు వచ్చి తల్లిదండ్రులకు కాల్ చేయమంటే ఏం చేయాలి.? మీకు చట్టపరమైన హక్కులు ఉన్నాయా లేదా అనే విషయాలపై ఓ క్లారిటీకి వచ్చేద్దాం. తాజాగా దీనిపై అడ్వకేట్ ఒకరు తన ఇన్‌స్టాలో కీలక వ్యాఖ్యలు చేశారు. 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులను మేజర్లుగా పరిగణిస్తారని.. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21, అనగా రైట్ టూ ప్రైవసీ మేజర్లకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. అంటే, మేజర్లుగా మీ వ్యక్తిగత జీవితాన్ని మీకు ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా గడపవచ్చు. ఎవరూ, పోలీసులకు కూడా, దీనిని అడ్డుకునే అధికారం లేదు.

పోలీసులు మీ తల్లిదండ్రులకు కాల్ చేయమని అడిగితే, అది కేవలం వారి రిక్వెస్ట్ మాత్రమే. అది ఆర్డర్ కాదు. కాల్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే, మీరు మేజర్లు అని నిరూపించుకునేందుకు అవసరమైన ఐడీ ప్రూఫ్‌ను పోలీసులకు చూపించాలి. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని భయపెట్టినా, చట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లినా, లేదా వారి అధికారాన్ని దుర్వినియోగం చేసినా, మీరు వారిపై చర్యలు తీసుకోవచ్చు. బి.ఎన్.ఎస్ సెక్షన్లు 126, 127, 351 లేదా ఐ.పి.సి సెక్షన్ 166 కింద కేసు నమోదు చేయవచ్చు. ఇటువంటి చర్యలకు పాల్పడిన పోలీసులకు కనీసం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Follow Us