Folk Song : చేజారిన ప్రేమ గుర్తొస్తే.. గుండె బరువెక్కించిన సాంగ్.. 7 ఏళ్లుగా యూట్యూబ్లో ట్రెండింగ్..
ఇప్పుడు ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పల్లె పాటలు విడుదలై యూట్యూబ్లో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఫోక్ సాంగ్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పాటలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. 7 ఏళ్లుగా ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తుంది.

వాలెంటైన్స్ డే… ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (ఫిబ్రవరి 14న) ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఒక లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ తెగ వైరలవుతుంది. దాదాపు 7 సంవత్సరాలుగా ఆ పాట యూట్యూబ్ ను ఊపేస్తుంది. ముఖ్యంగా పాటలోని ప్రతి చరణం… గుండె పగిలిన అబ్బాయిని ఏడిపించేస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్.. ఈ స్టేజ్ దాటి ముందుకు రావడం అంత సులభం కాదు. ఎంతో మంది తమ ప్రేమను మార్చిపోయి ముందుకు సాగుతుంటారు. మరికొందరు గుండెల్లో బాధను మోస్తూనే జ్ఞాపకాలతో సతమతమవుతుంటారు. అయితే లవ్ ఫెయిల్యూర్ పాటలు మాత్రం మరోసారి ఆ జ్ఞాపకాలను కళ్ల ముందుకు తెస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ సైతం ప్రతి కుర్రాడి మనసును మెలిపెట్టేస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్లో సంచలనంగా మారింది..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పేరు “గుర్తుకొచ్చినప్పుడల్లా..” ఒకప్పుడు ఈ సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది.
“గుర్తుకొచ్చినప్పుడల్లా..
గాయాలు చేశావు ఈ జన్మకు..
భారాన్ని వేశావు నా జన్మకు..
బంధాన్ని తెంపావు ఈ జన్మకు..
మరుపంటు రావమ్మ ఏ జన్మకు..
మారిపోయావే ఓ పిల్లా..
మరచిపోయావే నన్నిల్లా..” అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో మరోసారి ట్రెండింగ్ అవుతుంది. 2019లో విడుదలైన ఈ పాట అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసింది. ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగింది. ఈ పాటకు కళ్యాణ్ సంగీతం అందించగా.. లక్ష్మణ్ సాహిత్యం అందించారు. ఫోక్ సింగర్ రాము ఈ లవ్ ఫెయిల్యూర్ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించాడు. ఇంతకీ ఈ పాటను మీరు విన్నారా.. ?
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..
