మెగా బారసాల అయిపోయింది.. ఆ పేర్లలో అంత అర్థం ఉందా..?
మెగా స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ఇంట సందడి నెలకొంది. తాజాగా జరిగిన బారసాల వేడుకలో వారి కవల పిల్లలకు శివరామ్, అన్వీరా దేవి అని నామకరణం చేశారు. చిరంజీవి అసలు పేరు నుండి శివను, రామ్ చరణ్ పేరు నుండి రామ్‌ను తీసుకుని వారసుడికి శివరామ్ అని పేరు పెట్టారు. అన్వీరా దేవి పేరు వెనుక అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి.
మెగా కుటుంబంలో గత కొన్ని రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనల ఇంట కవల పిల్లలు అడుగుపెట్టడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. తాజాగా జనవరి 31న జన్మించిన ఈ కవల పిల్లలకు బారసాల వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్ తన వారసుడికి శివరామ్ కొణిదెల అని, చిన్న కూతురుకు అన్వీరా దేవి అని నామకరణం చేశారు. శివరామ్ పేరు వెనుక మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ నుండి శివను, రామ్ చరణ్ పేరు నుండి రామ్ తీసుకుని ఈ పేరును ఖరారు చేశారు. ఇందులో దైవశక్తి కూడా ఇమిడి ఉంది. చిన్న కూతురు అన్వీరా దేవి పేరు కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో పెట్టారు. వారి పెద్ద కూతురు క్లీంకారకు కూడా అమ్మవారి పేరునే పెట్టారు చరణ్. సాంప్రదాయ వస్త్రధారణలో కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరిగిన ఈ బారసాల వేడుక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. వేడుక అనంతరం రామ్ చరణ్ త్వరలోనే తన పెండింగ్ షూటింగ్‌లలో పాల్గొననున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

