AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాల్..బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..వేటు తప్పదా ?

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి అది ఆట వల్ల కాదు, తన వ్యక్తిగత జీవితం, బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల వల్ల. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం భారత జట్టు కొలంబో చేరుకుంది.

Hardik Pandya : గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాల్..బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..వేటు తప్పదా ?
Hardik Pandya Mahieka Sharma
Rakesh
|

Updated on: Feb 14, 2026 | 10:09 AM

Share

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి అది ఆట వల్ల కాదు, తన వ్యక్తిగత జీవితం మరియు బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల వల్ల. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం భారత జట్టు కొలంబో చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘనస్వాగతం లభించగా, అక్కడికి హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి రావడమే ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది. దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి టీమ్ బస్సులో, హోటల్‌లో కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మిగిలిన ఆటగాళ్లంతా ఒంటరిగా వస్తే హార్దిక్ మాత్రం గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి రావడమేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది బీసీసీఐ అధికారిక నిబంధనలకు విరుద్ధమని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

సాధారణంగా ఐసీసీ టోర్నీలు లేదా విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను లేదా భాగస్వాములను వెంట తెచ్చుకోవడంపై బీసీసీఐకి కొన్ని కఠినమైన రూల్స్ ఉన్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఆటగాళ్లు తమ భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌ను వెంట తీసుకురావడానికి బోర్డు అనుమతి నిరాకరించింది. ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కానీ, హార్దిక్ ఏకంగా టీమ్ అఫీషియల్ ట్రావెల్‌లో మాహికాను తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో అర్ష్‌దీప్ సింగ్ స్థానిక డాన్సర్లతో కలిసి చిందేస్తుండగా, అదే వీడియోలో హార్దిక్-మాహికా జంట కెమెరాకు చిక్కింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. హార్దిక్ కు బీసీసీఐ రూల్స్ వర్తించవా? అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే, టీమ్ బస్సులో గర్ల్‌ఫ్రెండ్‌కు చోటు ఎలా ఇచ్చారు? అని మరొకరు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం 45 రోజుల కంటే ఎక్కువ పర్యటన ఉంటేనే ఫ్యామిలీకి 14 రోజుల పర్మిషన్ ఉంటుంది. కానీ ఇక్కడ హార్దిక్ వ్యవహారం బోర్డు రూల్స్ కు చెక్ పెట్టినట్టుగా ఉందని విమర్శలు వస్తున్నాయి.

గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారనే పేరుంది. మరి ఇలాంటి సమయంలో హార్దిక్ వ్యవహారాన్ని గంభీర్, బీసీసీఐ ఎలా చూస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పాకిస్థాన్‌తో చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్ ముందు ఇలాంటి వివాదాలు జట్టు వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హార్దిక్ తన వ్యక్తిగత కారణాల వల్ల గతంలోనూ చాలాసార్లు వార్తల్లో నిలిచారు, అయితే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇలా నిబంధనలు ఉల్లంఘించడం పై బోర్డు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..