AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌ వైపు అమెరికా యుద్ధ నౌకలు ..ఏం జరగబోతోంది?

ఇరాన్‌ వైపు అమెరికా యుద్ధ నౌకలు ..ఏం జరగబోతోంది?

Samatha J
|

Updated on: Feb 14, 2026 | 12:12 PM

Share

ఇరాన్‌తో అణు కార్యక్రమంపై చర్చలు విఫలమైతే సైనిక చర్యకు వెనకాడమని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. ప్రస్తుతం ఒమన్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కొలిక్కి రాకపోతే దాడులకు దిగేందుకైనా సిద్ధమేనని అమెరికా సంకేతాలిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక మోహరించి ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక జెరాల్డ్ ఫోర్డ్‌ను కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్‌ వైపు తరలిస్తోంది అమెరికా. ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని మరింత పెంచేందుకే ఈ చర్య తీసుకుందా? ఆ ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలు అందుబాటులో ఉంటాయి.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం, కరేబియన్‌లో ఉన్న జెరాల్డ్ ఫోర్డ్ యుద్ధనౌక… అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం మీదుగా పర్షియన్ గల్ఫ్ వైపు పయనిస్తోంది. ఈ నౌకలో అత్యాధునిక డెస్ట్రాయర్లు కూడా ఉన్నాయి. ఈ విమానవాహక నౌక మే నెల ఆరంభం వరకు మధ్యప్రాచ్యంలోనే ఉండే అవకాశం ఉందని, దీంతో దీని మోహరింపు కాలం 10 నెలలకు పొడిగించవచ్చని తెలుస్తోంది. గతంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించేందుకు అమెరికా చేపట్టిన సైనిక చర్యలో జెరాల్డ్ ఫోర్డ్ నుంచే యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. దాంతో ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకే అమెరికా ఈ చర్య తీసుకుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ యుద్ధ నౌక తరలింపు

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?