Bigg Boss : త్వరలోనే బిగ్‏బాస్ కొత్త సీజన్.. ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పేశారు.. ఎవరంటే..

బిగ్‏బాస్ షోకు మాత్రం అడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి కాగా.. త్వరలోనే ఎనిమిదవ సీజన్ స్టార్ట్ కానుంది. అలాగే హిందీలో ఇప్పటివరకు 17 సీజన్స్ పూర్తయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ వరుస సీజన్స్ చేస్తున్నారు. ఓవైపు టీవీల్లోనే కాకుండా అటు ఓటీటీలోనూ ఎంజాయ్ చేస్తున్నారు అడియన్స్. హిందీ ఓటీటీలో బిగ్‏బాస్ షో రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ అలరించేందుకు సిద్ధమయ్యింది.

Bigg Boss : త్వరలోనే బిగ్‏బాస్ కొత్త సీజన్.. ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పేశారు.. ఎవరంటే..
Vadapav Girl
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 20, 2024 | 7:37 AM

బుల్లితెరపై బిగ్‏బాస్‏ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా ఏ భాషలో అయినా ఈ షోకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. వివాదాలు, విమర్శలు ఎన్ని వచ్చినా రోజుకు రోజుకు ఈ షోను ఆదరించే ప్రేక్షకులు పెరుగుతున్నారు. ఇప్పటికే అనేక సీజన్స్ కంప్లీట్ కాగా.. బిగ్‏బాస్ షోకు మాత్రం అడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి కాగా.. త్వరలోనే ఎనిమిదవ సీజన్ స్టార్ట్ కానుంది. అలాగే హిందీలో ఇప్పటివరకు 17 సీజన్స్ పూర్తయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ వరుస సీజన్స్ చేస్తున్నారు. ఓవైపు టీవీల్లోనే కాకుండా అటు ఓటీటీలోనూ ఎంజాయ్ చేస్తున్నారు అడియన్స్. హిందీ ఓటీటీలో బిగ్‏బాస్ షో రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ అలరించేందుకు సిద్ధమయ్యింది.

ఫస్ట్, సెకండ్ సీజన్లకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేయగా.. ఇప్పుడు మూడో సీజన్ కోసం మరో బీటౌన్ సీనియర్ హీరో రంగంలోకి దిగాడు. బిగ్‏బాస్ హిందీ 3 సీజన్ హోస్ట్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా రివీల్ చేశారు. బిగ్‏బాస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా తన ఇన్ స్టాలో మొదటి కంటెస్టెంట్ ఫోటోలను షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేసింది.

ఆ ఫోటోలో చిన్న బండి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆమె ఫేమస్ వడాపావ్ గర్ల్ చంద్రిక అని అంటున్నారు. ఢిల్లీ వీధుల్లో వడాపావ్ అమ్ముతూ చంద్రిక చాలా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు బిగ్‏బాస్ షోలోకి అడుగుపెట్టనుంది. ఈ షోలో చంద్రిక ఎలా అలరిస్తుందో చూడాలి. బిగ్‏బాస్ ఓటీటీ 3 సీజన్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.