AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..!

Chanakya Neeti: చాణక్యుడి ఆలోచనలు కేవలం రాజకీయ, ఆర్థిక రంగాలకే పరిమితం కాకుండా.. వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో విలువైనవి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలపై చాణక్యుని సూచనలు మనకు సమకాలీన సమాజంలో కూడా దారిచూపే మార్గదర్శకాలుగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: చాణక్యుడు చెప్పిన సీక్రెట్..  భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..!
Chanakya Niti Couples
Rajashekher G
|

Updated on: Feb 07, 2026 | 3:28 PM

Share

భారత ఆర్థిక శాస్త్ర, నీతి శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు మానవుడు తన జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సులువైన పరిష్కారాలను చూపించాడు. మనిషి ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో చెప్పాడు. అంతేగాక, మానవ సంబంధాలలో వ్యక్తుల బాధ్యలను కూడా సవివరింగా తెలియజేశారు. అందుకే, చాణక్యుడి ఆలోచనలు కేవలం రాజకీయ, ఆర్థిక రంగాలకే పరిమితం కాకుండా.. వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో విలువైనవి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలపై చాణక్యుని సూచనలు మనకు సమకాలీన సమాజంలో కూడా దారిచూపే మార్గదర్శకాలుగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భార్యాభర్తలు.. “కుటుంబ రథానికి రెండు చక్రాలు”

భార్యాభర్తలు కుటుంబం అనే ఒక రథానికి రెండు చక్రాల్లాగా ఉంటారని. ఈ రెండు చక్రాలు ఒకే వేగంతో కదులుతున్నప్పుడు, రథం సజావుగా నడుస్తుంది. కానీ ఒక చక్రం విరిగిపోతే లేదా వేగం మారితే.. రథం దెబ్బతినడం సహజం. ఈ విధంగా, కుటుంబంలో సౌహార్ధాన్ని నిలుపుకోవడం కోసం భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవడం అవసరం అని స్పష్టం చేశారు చాణక్యుడు.

గౌరవం, సమానత్వం

చాణక్యుడు కుటుంబంలో భార్యాభర్తల పాత్రలు సమానమని, అందువలన ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంత ముఖ్యమో చాణక్యుడు వివరించాడు. భర్త సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తాడు. భార్య ఇంటి నిర్వహణ, పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి గౌరవం రెండు వైపులా ఉండాలి అని స్పష్టం చేశాడు.

సహనం, త్యాగం

జీవితంలో ఎప్పుడూ సుఖం, సంతోషం మాత్రమే ఉండదు. సమస్యలు, ఒడిదుడుకులు ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో, భార్యాభర్తలు ఒకరినొకరు విడిచిపెట్టకుండా, ఓపికగా ఉండటం అత్యంత ముఖ్యం అని చాణక్యుడు సూచించాడు.

సుఖదుఃఖాలలో భాగస్వామ్యం

ప్రతి సుఖం, ప్రతి దుఃఖంలో ఒకరినొకరు పంచుకోవడం భార్యాభర్తల బలమైన సంబంధానికి కీలకం. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం.. భర్త తన భార్య భావాలను అర్థం చేసుకోవాలి, అలాగే భార్య కూడా భర్త భావాలను పంచుకోవాలి అని సూచించాడు.

ప్రేమ – సంబంధానికి పునాది

భార్యాభర్తల మధ్య ప్రేమ ప్రాథమిక పునాది అని చాణక్యుడు భావించాడు. ప్రేమ వల్లే జీవితంలో మధురత, సౌఖ్యం, మనసిక సమాధానం పెరుగుతుందన్నాడు.

అంచనాలను సక్రమంగా ఉంచడం

చాణక్యుడు చెప్పినట్లు, జీవితంలో అంచనాలు సహజం. భాగస్వామి మన నుంచి ఏమి ఆశిస్తున్నారో గుర్తుంచుకోవడం, వాటిని సాధించడానికి ప్రయత్నించడం అవసరం. అదే సమయంలో, ఒకరినొకరు అవాస్తవ అంచనాలతో కష్టపెట్టకూడదు. చివరగా, చాణక్యుని ఈ సూత్రాలు చెప్పేది ఏమిటంటే.. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించడం, సహనం, ప్రేమ, అంచనాలను సక్రమంగా ఉంచడం ద్వారా మాత్రమే కుటుంబం సుస్థిరంగా ఉంటుంది. సుఖసంతోషాలు పెరుగుతాయి. కష్టసమయాల్లో కూడా ధైర్యంగా పోరాడవచ్చు.