AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Diseases: మీ కిడ్నీలు కడిగిన ముత్యంలా మారాలంటే ఉలవలు, బార్లీ ఇలా తీసుకోండి.. బాబా రాందేవ్‌

నేటి జీవనశైలి కారణంగా కిడ్నీలో రాళ్లు, మంట, దెబ్బతినడం వంటి సమస్యలు సర్వసాధారమయ్యాయి. నీళ్లు అధికంగా తీసుకోకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక ఐరన్ స్థాయిలు.. వంటి కారణాలు కిడ్నీ సమస్యలకు దోహదం చేస్తాయి. కిడ్నీ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే అవి తీవ్రమైన వ్యాధులుగా మారే ప్రమాదం లేకపోలేదు..

Kidney Diseases: మీ కిడ్నీలు కడిగిన ముత్యంలా మారాలంటే ఉలవలు, బార్లీ ఇలా తీసుకోండి.. బాబా రాందేవ్‌
Swami Ramdev On Kidney Diseases
Srilakshmi C
|

Updated on: Feb 07, 2026 | 4:56 PM

Share

ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అనేక చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి కూడా ఈ సమస్యలకు చికిత్స చేయవచ్చు. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు స్వామి రాందేవ్ కొన్ని ఆయుర్వేద పద్ధతులను సూచిస్తున్నారు. ఇవి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కిడ్నీల్లో రాళ్ల నివారణకు బాబా రామ్‌దేవ్ ఇంటి చిట్కాలు

మూత్రపిండాల్లో రాళ్లు, వాపుకు వివిధ ఇంటి చిట్కాలను రాందేవ్‌ సూచిస్తున్నారు. ఇవి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రభావవంతంగా ఉంటాయి. ఇందులో వేప, రావి ఆకు రసం, కస్ని, గోఖ్రు, కొత్తిమీర, పుదీనా వంటి మూలికల మిశ్రమం ఉన్నాయి. బాబా రామ్‌దేవ్ ప్రకారం.. ప్రతిరోజూ ఆహారంలో కొత్తిమీరను తీసుకునే వ్యక్తుల మూత్రపిండాలు ఆరోగ్యకరంగా ఉంటాయని తెలిపారు. నిజానికి కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, C, K, వివిధ ఖనిజాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించి, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.

ఉలవలు

ఎవరికైనా మూత్రపిండాలు, పిత్తాశయం, క్లోమంలో రాళ్ళు ఉంటే వాటిని తొలగించడానికి ప్రతిరోజూ ఉలవలు (కులతి పప్పు) తినాలని రాందేవ్ సూచించారు. వారానికి ఒకసారైనా ఉలవలు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బార్లీ

మూత్రపిండాల పనితీరును చురుగ్గా నిర్వహించడానికి బార్లీ పిండి రోటీ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని బాబా రామ్‌దేవ్ అంటున్నారు. వారానికి కనీసం ఒకటి లేదా రెండుసార్లు బార్లీ పిండి రోటీ తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది కిడ్నీ సమస్యలను తొలగిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ రసం తాగాలి

కిడ్నీ రోగులు కాకరకాయ రసం తాగాలని బాబా రాందేవ్ సలహా ఇస్తున్నారు. కాకరకాయ రసం తాగడం వల్ల కడుపు సమర్థవంతంగా శుభ్రపడుతుందని ఆయన అంటున్నారు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాకరకాయ రసం అందుబాటులో లేకపోతే టమోటా రసం తాగవచ్చు. కాకరకాయ రసం వారానికి ఒకసారి తాగడం వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని రాందేవ్ అన్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.