Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పతంజలి ఆయుర్వేద సంస్థ

పతంజలి ఆయుర్వేద సంస్థ

పతంజలి ఆయుర్వేద సంస్థను 1995లో హరిద్వార్‌లో తన స్నేహితుడు బాలకృష్ణతో కలిసి యోగా గురువు బాబా రాందేవ్ ప్రారంభించారు. యోగా, ఆయుర్వేదం రంగాల అభివృద్ధి లక్ష్యంతో రాందేవ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారత ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద సంస్థ రికార్డు సృష్టించింది. దేశంలో దశాబ్దాలుగా పాతుకపోయిన పలు విదేశీ ఎఫ్ఎంసీజీ సంస్థలకు కూడా పతంజలి శరవేగంగా అభివృద్ధి చెందింది. పతంజలి ఆయుర్వేద పలు విదేశాలకు కూడా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

ఇప్పటికే 1000కి పైగా ఆయుర్వేద ఉత్పత్తులను చేస్తున్న పతంజలి సంస్థ.. మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు విస్తృత పరిశోధనలు చేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థకు దేశంలో 50 వేలకు పైగా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. మరో 5-10 ఏళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్ స్థాయికి కంపెనీని తీసుకెళ్లాలని రాందేవ్, బాలకృష్ణ లక్ష్యంగా పెట్టుకున్నారు. పతంజలి ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో రాందేవ్ కీలకంగా వ్యవహరిస్తున్నా.. ఆ సంస్థ నిర్వహణలో బాలకృష్ణ విశేష కృషిచేస్తున్నారు. పతంజలి ఆయుర్వేద సంస్థలో 94 శాతం వాటాలు బాలకృష్ణదే.

ఇంకా చదవండి

Patanjali Healthcare: పతంజలి హెల్త్‌కేర్ వెల్‌నెస్ సెంటర్లు.. ఎలాంటి మందులు లేకుండానే నేచురల్ థెరపీ!

Patanjali Healthcare Wellness Centers: బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ప్రారంభించిన ఆరోగ్య కేంద్రం. ఇక్కడ దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధులకు సహజ పద్ధతిలో చికిత్స చేస్తారు. ఇక్కడ ఆధునిక మందులకు బదులుగా, ఆయుర్వేద మందులు, యోగా, పంచకర్మ, ప్రత్యేక ఆహారంతో చికిత్స జరుగుతుంది..

Patanjali: ఇండియాను బలోపేతం చేయడంలో భాగమవుతున్న పతంజలి!

పతంజలి ఆయుర్వేదం భారతీయ ఆరోగ్య రంగాన్ని విప్లవం చేసి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. స్వావలంబన, సమగ్ర ఆరోగ్యంపై దృష్టి సారించి, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఆయుర్వేద పరిశోధన, టెలిమెడిసిన్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తూ, భారతదేశ అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

  • SN Pasha
  • Updated on: Mar 20, 2025
  • 12:46 pm

పతంజలితో భారత క్రీడా రంగం బలోపేతం! ఆటగాళ్ల సామర్థ్యాన్ని మెరుగుపర్చింది..

భారత క్రీడాకారులు ప్రపంచ వేదికలపై అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ విజయంలో పతంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ఆర్థిక సహాయం, ఆయుర్వేద ఉత్పత్తులు, క్రీడా పోషణ ద్వారా అథ్లెట్లను బలపరుస్తోంది. యువతను ప్రోత్సహించే కార్యక్రమాలు కూడా చేపడుతోంది. పతంజలి యొక్క కృషి భారత క్రీడల అభివృద్ధికి దోహదపడుతోంది.

  • SN Pasha
  • Updated on: Mar 19, 2025
  • 1:52 pm

Patanjali: పతంజలి నుంచి మూత్రపిండ వ్యాధులకు దివ్యౌషధం.. పరిశోధనలో కీలక అంశాలు!

Patanjali: ఆయుర్వేద శాస్త్రీయ ఆధారాలను ప్రపంచ స్థాయిలో గుర్తించడంలో రెనోగ్రిట్ విజయం ఒక ముఖ్యమైన అడుగు అని పతంజలి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ అన్నారు. రెనోగ్రిట్ మూత్రపిండాల వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందనేది తన వాదన మాత్రమే కాదని ఆయన అన్నారు..

Patanjali Mega Food Park: పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ప్రారంభం.. నాగ్‌పూర్ సీఎం ఫడ్నవీస్ హాజరు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. దీనిని నిర్మించడానికి 9 సంవత్సరాల సమయం పట్టిందని అన్నారు. పలు రాష్ట్రాల్లో ఉచితంగా ఇస్తున్న భూమిలో ఫుడ్ పార్క్ నిర్మించడానికి బదులుగా, బాబా రామ్‌దేవ్ నాగ్‌పూర్‌ను ఎంచుకుని, ఇక్కడి భూమికి ధర చెల్లించి దానిని పూర్తి చేశారని అన్నారు..

నాగ్‌పూర్‌లో రూ.1,500 కోట్లతో పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్.. ఎప్పటి నుంచంటే?

ఉపాధి కల్పనలో పతంజలి మరో ముందడుగు వేసింది. నాగ్‌పూర్‌లో దాదాపు రూ.1500 కోట్ల టర్నోవర్ కలిగి ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌లో నిర్మిస్తోంది. ప్లాంట్ ద్వారా ప్రస్తుతం ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 500 మందికి ఉపాధి కల్పించనుంది. పని విస్తరిస్తున్న కొద్దీ, ఈ సంఖ్య వేగంగా పెరుగుతుందని పతంజలి పేర్కొంది. త్వరలో ఈ ప్లాంట్ 10 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపింది.