AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali Immuno Charge: రోగనిరోధక శక్తిని పెంచే పతంజలి ఇమ్యునోచార్జ్.. స్వామీ రాందేవ్‌ సూచనలు విన్నారా?

నేటి మారుతున్న జీవనశైలి కారణంగా ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా మందిలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల తరచూ జలుబు, దగ్గు, అలసట, ఇన్ఫెక్షన్లు, బలహీనత వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, అధిక ఒత్తిడి, కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం కూడా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి..

Patanjali Immuno Charge: రోగనిరోధక శక్తిని పెంచే పతంజలి ఇమ్యునోచార్జ్.. స్వామీ రాందేవ్‌ సూచనలు విన్నారా?
Patanjali Immunocharge
Srilakshmi C
|

Updated on: Feb 18, 2026 | 5:18 PM

Share

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆయుర్వేద ప్రత్యామ్నాయాలను సైతం చాలా మంది కోరుకుంటున్నారు. ఇటువంటి వారికి పతంజలి ఇమ్యునోచార్జ్ అనే రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద ఉత్పత్తిని స్వామి రామ్‌దేవ్ సూచిస్తున్నారు. తరచుగా అనారోగ్యం, బలహీనత, సీజనల్ వ్యాధులతో బాధపడేవారికి పతంజలి ఇమ్యునోచార్జ్ ప్రయోజనకరంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి లక్షణాలను దృష్టిలో ఉంచుకుని వాటిని వెంటనే పరిష్కరించడం, శరీరాన్ని అంతర్గతంగా బలోపేతం చేయడం చాలా ముఖ్యం. పతంజలి ఇమ్యునోచార్జ్ ఎలా పనిచేస్తుందో, దాని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తిని పెంచడంలో పతంజలి ఇమ్యునోచార్జ్ ఎలా పనిచేస్తుంది?

పతంజలి ఇమ్యునోచార్జ్‌లో శరీర రోగనిరోధక శక్తిని పెంచే అనేక ఆయుర్వేద పదార్థాలు ఉన్నాయని స్వామి రామ్‌దేవ్ అంటున్నారు. ఇందులో గిలోయ్, ఉసిరి, అశ్వగంధ, తులసి, పసుపు వంటి పదార్థాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో గిలోయ్ సహాయకారిగా పరిగణించబడుతుంది. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీర సహజ రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే ఇందులోని అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి, శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది. తులసి, పసుపులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దండిగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ కలిసి శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేయడానికి, అలసటను తగ్గించడానికి, వ్యాధిని నివారించడానికి సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా సమతుల్య పరిమాణంలో తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే పతంజలి ఇమ్యునోచార్జ్‌ను ఉపయోగించాలనే విషయం మర్చిపోకూడదు.

రోగనిరోధక శక్తి పెంపు

రోగనిరోధక శక్తిని పెంచడానికి సప్లిమెంట్లపై మాత్రమే ఆధారపడటం సరిపోదు. మీ రోజువారీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, కాలానుగుణ పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, తగినంత ప్రోటీన్‌ ఆహారాలను కూడా చేర్చుకోవాలి. గోరువెచ్చని నీళ్లు, పసుపు పాలు, తులసి-అల్లం టీ తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. జంక్ ఫుడ్, చక్కెర వినియోగాన్ని నివారించాలి. రోగనిరోధక శక్తికి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి సరిపడా నీళ్లు తాగాలి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన అలవాట్లు

బలమైన రోగనిరోధక శక్తి కోసం ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ తగినంత నిద్ర పోవాలి. తద్వారా ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరాన్ని చురుకుగా ఉంచుకోవచ్చు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా బలమైన రోగనిరోధక శక్తి పొందొచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us