Sania Mirza: ‘నా నవ్వుకు కారణం నువ్వే’.. కుమారుడి పుట్టిన రోజున సానియా మీర్జా ఎమోషనల్.. ఫొటోస్ వైరల్

హైదరాబాదీ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా పేరు ఈ మధ్యన బాగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని, రాజకీయాల్లోకి వస్తుందని.. ఇలా తరచూ ఏదో ఒక రూమర్లు సానియాపైనే వస్తున్నాయి. అయితే ఈ టెన్నిస్ బ్యూటీ మాత్రం వీటిని అసలు లెక్క చేయడం లేదు.

Sania Mirza: 'నా నవ్వుకు కారణం నువ్వే'.. కుమారుడి పుట్టిన రోజున సానియా మీర్జా ఎమోషనల్.. ఫొటోస్ వైరల్
Sania Mirza
Follow us

|

Updated on: Oct 31, 2024 | 10:53 PM

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా ప్రస్తుతం తన ఫ్యామిలీతోనే ఎక్కువగా ఉంటోంది. టెన్నిస్ కు వీడ్కోలు పలికిన తర్వాత తన కుమారుడే తన ప్రపంచమైపోయాడు. ఇక పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకుల వ్యవహారంతో కొంత డిస్ట్రబ్ అయినప్పటికీ తన కుమారుడికి మంచి భవిష్యత్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా తన కొడుకు ఇజహాన్ ఆరో పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసింది సానియా. అనంతరం కొడుకు బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘నా చిన్నారి బాబూ.. నువ్వు ఆరేళ్ల వాడివి అయ్యావంటే అసలు నమ్మలేకపోతున్నా. నా నవ్వుకు నువ్వే కారణం. హ్యాపీ బర్త్‌డే మై లడ్డూ’ అంటూ కొడుకుపై తన కున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది సానియా. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అలాగే ఇజహాన్ బర్త్ డే ఫొటోస్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కూడా సానియా కుమారుడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను 2010లో పెళ్లాడింది సానియా మీర్జా. అక్టోబరు 30, 2018న కుమారుడికి జన్మనిచ్చింది. అయితే కొన్ని నెలల క్రితమే సానియా- షోయబ్‌ విడాకులు తీసుకున్నారు. షోయబ్‌ మాలిక్‌ పాక్‌ నటి సనా జావెద్‌ను పెళ్లాడిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఇక కుమారుడు ఇజహాన్‌ మాత్రం తల్లి సానియా వద్దే ఉంటున్నాడు.

సానియా కుమారుడి బర్త్ డే వేడుకలు..

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

కాగా ఆ మధ్యన టీమిండియాకు చెందిన ఓ స్టార్ క్రికెటర్ తో సానియా రెండో వివాహం జరుగుతుందని పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లను సదరు క్రికెటర్ తో పాటు సానియా తండ్రి కూడా గట్టిగా ఖండించాడు.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

ఫ్యామిలీతో వెకేషన్ లో సానియా మీర్జా.. వీడియో

View this post on Instagram

A post shared by Anam Mirza (@anammirzaaa)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..