RR IPL 2025: బట్లర్‌కు బిగ్ షాక్.. ఆ యువ ఆటగాళ్లకు రూ. 18 కోట్లు.. రాయల్స్ రిటైన్ లిస్టు ఇదిగో

ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు షాకిచ్చింది రాజస్థాన్ రాయల్స్. అతడ్ని రిటైన్ చేసుకోకుండా.. మెగా ఆక్షన్‌లోకి వదిలిపెట్టేసింది. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేస్తూ.. కెప్టెన్ సంజు శాంసన్, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు రూ. 18 కోట్ల చొప్పున పారితోషికం అందించనుంది.

RR IPL 2025: బట్లర్‌కు బిగ్ షాక్.. ఆ యువ ఆటగాళ్లకు రూ. 18 కోట్లు.. రాయల్స్ రిటైన్ లిస్టు ఇదిగో
Rajasthan Royals Ipl 2025
Follow us

|

Updated on: Oct 31, 2024 | 9:32 PM

ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు షాకిచ్చింది రాజస్థాన్ రాయల్స్. అతడ్ని రిటైన్ చేసుకోకుండా.. మెగా ఆక్షన్‌లోకి వదిలిపెట్టేసింది. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేస్తూ.. కెప్టెన్ సంజు శాంసన్, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు రూ. 18 కోట్ల చొప్పున పారితోషికం అందించనుంది. ఇక యువ క్రికెటర్ రియాన్ పరాగ్, వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు, వెస్టిండీస్ బ్యాటర్ షిమ్రోన్ హెట్మెయర్‌కు రూ. 11 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది రాజస్థాన్ జట్టు. అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా సందీప్ శర్మకు రూ. 4 కోట్లు ఇవ్వనుంది. అటు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌లకు నిరాశ తప్పలేదు. రాజస్థాన్ మొత్తం రూ. 79 కోట్లు వీరిపై ఖర్చు చేయగా.. రూ. 41 కోట్లతో మెగా వేలంలోకి అడుగుపెట్టనుంది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ రాయల్స్ రిటైన్ లిస్టు:

సంజు శాంసన్ (INR 18 కోట్లు)

యశస్వి జైస్వాల్ (INR 18 కోట్లు)

ర్యాన్ పరాగ్ (INR 14 కోట్లు)

ధృవ్ జురెల్ (INR 14 కోట్లు)

షిమ్రోన్ హెట్మెయర్ (INR 11 కోట్లు)

సందీప్ శర్మ (INR 4 కోట్లు)

వేలానికి మిగిలి ఉన్న పర్స్: INR 41 కోట్లు (INR 120 కోట్లలో)

రైట్-టు-మ్యాచ్ (RTM): ఏదీ లేదు

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ ప్లేయర్స్:

జోస్ బట్లర్, డోనోవన్ ఫెర్రెరియా, కునల్ రాథోర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవ్‌దీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, రోవ్‌మన్ పోవెల్, శుభ్‌మ్ దుబే, టామ్ కోహ్లేర్-కాడ్‌మోర్, అబిడ్ ముష్తక్, నండ్రే బర్గర్, తనూష్ కోటియన్, కేశవ్ మహరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆడమ్ జంపా.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..