AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

డాక్టర్లు చాలా అరుదైన కేసులను పరిశీలిస్తుంటారు. ఇటీవల ఇలాంటి అరుదైన కేసు ఒకటి ఢిల్లీలోని డాక్టర్లకు ఎదురైంది. ఇంతకీ అదేంటి.? అసలు ఆ పేషెంట్‌కి ఏం జరిగిందో ఇప్పుడు స్టోరీలో తెలుసుకుందామా..

Viral: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా
Representative Image
Ravi Kiran
|

Updated on: Oct 27, 2024 | 6:16 PM

Share

ఓ 23 ఏళ్ల యువకుడు గత కొన్నిరోజులుగా అజీర్తి సమస్యతో బాధపడుతున్నాడు. మందులు ఎన్ని వేసుకున్నా.. అది తగ్గలేదు. ఇక చేసేదేమీలేక చివరికి డాక్టర్‌ను కన్సల్ట్ అయ్యాడు. కట్ చేస్తే.. ఆ రోగికి ఎక్స్‌రే తీసి.. దెబ్బకు షాక్ తిన్నారు వైద్యులు. ఈ ఘటన ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా అజీర్ణ సమస్యతో బాధపడుతున్న 23 ఏళ్ల వ్యక్తి.. ఎంతకూ ఆ రోగం తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు అతడికి సాధారణ పరీక్షలు నిర్వహించగా.. ఎక్స్‌రే చూసి దెబ్బకు షాక్ అయ్యారు. అతని కడుపులో సజీవంగా బతికున్న బొద్దింకను చూసి కంగుతిన్నారు. చిన్న ప్రేగుల లోపల ఆ బొద్దింక ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 10 నిమిషాల ఎండోస్కోపీ ప్రక్రియను పూర్తి చేసి.. వసంత్‌కుంజ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా బ్రతికున్న 3 సెంటీమీటర్ల బొద్దింకను బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్

ఆ ఆస్పత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ వాత్స్యా మాట్లాడుతూ.. ‘రోగికి తాను బొద్దింకను తిన్నట్లు తెలియదు. అలాగే ఆ బొద్దింక చెక్కుచెదరకుండా ఉండటం చూసి మేము ఆశ్చర్యపోయాం. గడిచిన రెండు లేదా మూడు రోజులలో రోగి ఆహారం తిన్న తర్వాత అజీర్తి, ఉబ్బరంతో బాధపడ్డాడు. సాధారణ పరీక్షలు నిర్వహించగా.. బొద్దింక ఉన్నట్టు తేలింది’ అని డాక్టర్ వాత్స్యా తెలిపారు. ఎండోస్కోపీ ద్వారా బొద్దింకను బయటకు తీసిన వైద్యులు.. ప్రస్తుతం రోగి ఆరోగ్యం కుదుటపడుతోందని చెప్పారు. చిన్న ప్రేగుల్లో బ్రతికున్న బొద్దింకతో ప్రాణాలకు ముప్పు.. లేదా లేనిపోని అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. అందుకే సదరు రోగికి వెంటనే ఎండోస్కోపీ సాయంతో శస్త్రచికిత్స చేశామని డాక్టర్ వాత్స్యా స్పష్టం చేశారు.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు