Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజిదేంటి.? ఈ ఫోటోలో నెంబర్ కనిపెట్టగలరా

మరో కిర్రాక్ పజిల్.. మిమ్మల్ని స్టన్ చేస్తుంది. మీ బుర్రను తికమక పెట్టేస్తుంది. ఈ ఫోటో పజిల్‌ను మీరు తెలివైనవారు అయితే.. క్షణాల్లో సాల్వ్ చేసేయండి.. మరి అదేంటో చూసేస్తారా.? ఓసారి లుక్కేయండి మరి..

Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏ రేంజిదేంటి.? ఈ ఫోటోలో నెంబర్ కనిపెట్టగలరా
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 26, 2024 | 7:54 PM

హలో గయ్స్.. మళ్లీ మీ ముందుకు ఓ కిర్రాక్ పజిల్‌తో వచ్చేశాం. దిమాక్ కరాబ్ చేసే పజిల్.. మీ మెదడు, కంటి చూపునకు పదునుపెట్టేస్తుంది. ప్రజంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. మీమ్స్ జాతర కనిపిస్తుంది. అలాగే అదే స్థాయిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ తెగ వైరల్ అవుతున్నాయ్. వీటిని కొందరు సరదా.. సరదాగా.. సాల్వ్ చేసేస్తున్నారు. లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టుగా చూపించే మ్యాజిక్ చేస్తాయ్ ఈ ఫోటో పజిల్స్.. మనల్ని ఓ పట్టు పట్టేస్తాయి. లేట్ ఎందుకు ఈ ఫోటోలోని పజిల్‌ అంతు చూసేయండి మరి.!

పైన పేర్కొన్న చిత్రాన్ని గమనించారా.! బ్లాక్ అండ్ వైట్ గీతల మధ్య ఓ నెంబర్ దాగుంది. ఆ గీతలు మీకు కదులుతున్నట్టు కనిపిస్తాయి. కానీ అది మ్యాజిక్ మాత్రమే. మొదటిగా అందులో కనిపించిన నెంబర్ ‘5283’ అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఆ గీతలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. కొంచెం పరిశీలించి చూస్తే మీరు ఆ నెంబర్ కనిపెట్టేయగలరు.

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

ఇవి కూడా చదవండి

Photo Puzzle

ఏంటీ.! ఎంత వెతికినా ఆన్సర్ దొరకట్లేదా.? నెంబర్ దొరక్కపోతే వర్రీ అవ్వకండి.! ఈసారి నెంబర్ ఏంటో మేమే చెప్పేస్తాం. మన దగ్గర ఇలాంటి స్టఫ్ చాలానే ఉంది. మళ్లీ ఇంకో పజిల్‌తో కలుద్దాం. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే.. 3452839.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..