AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పొలంలో నిద్రిస్తున్న మహిళపైకి ఎక్కి పడగవిప్పిన నాగుపాము.. ఆ తర్వాత

ఆరడుగుల నాగుపాము... పడగ విప్పి ఆడుతుంటే... దూరం నుంచి చూడాలంటేనే గుండె దడదడలాడుతుంది. అలాంటింది నిద్రిస్తుండగా ఒంటిపైకి ఎక్కి బుసలు కొడుతుంటే ఎలా ఉంటుంది? మరి ఆ మహిళ ఎలా బయటపడింది? రెండేళ్ల నాటి ఈ వీడియో మీకు గుర్తుందా..?

Viral Video: పొలంలో నిద్రిస్తున్న మహిళపైకి ఎక్కి పడగవిప్పిన నాగుపాము.. ఆ తర్వాత
Snake Viral News
Ram Naramaneni
|

Updated on: Oct 27, 2024 | 6:08 PM

Share

ఇది ఒళ్లు గగుర్పొడిచే సీన్. రియల్‌గా ఫేస్ చేస్తే గుండె ఆగిపోయేంత టెన్షన్‌ పెట్టే సీన్‌. ఆరడుగుల నాగుపాము ఒంటిపైకి ఎక్కి.. బుసకొడుతుంటే ప్రాణాలు పోయినంత పనైంది ఆమెకు. లోలోపలే దేవుడా దేవుడా అనుకుంటూ కదలక మెదలక ఉండిపోయింది. ఊపిరి బిగబట్టి శ్రీశైల మల్లయ్యా కాపాడవయ్యా అని వేడుకుంది. 2022 ఆగస్టు నెలలో కర్నాటకలోని కలబుగిరిలో జరిగిందీ ఘటన.

కలబురిగి జిల్లా మల్లాబాద్‌లో ఓ పొలం వద్ద మంచంపై నిద్రపోతున్న మహిళపైకి తాచుపాము ఎక్కింది. పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ అలికిడికి మెలకువ వచ్చిన ఆమె తన మీద ఉన్న పామును చూసి షాకైపోయింది. గుండె ఆగినంత పనైంది. కదలకుండా అలాగే ఉండిపోయింది. ఊపిరి బిగబట్టి శ్రీశైల మల్లన్నను ప్రార్థించింది.అలా కొన్ని నిమిషాల పాటు తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. పాము కాటేస్తుందా.. లేక సైలెంట్‌గా వెళ్లిపోతుందా.. చూస్తున్న వాళ్లలో ఒకటే టెన్షన్. అదృష్టవశాత్తూ నాగుపాము ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లిపోయింది.

పాము దానికదే వెళ్లిపోయే వరకూ ఆ మహిళ పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. మల్లయ్య సామీ..కాపాడు సామీ అంటూ శివయ్యకు మొక్కుతూనే ఉంది. ఇదంతా ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డ్‌ చేయడంతో వెలుగుచూసింది. కాగా రెండేళ్ల క్రితం నాటి ఈ వీడియో తాజాగా మరోసారి ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..