AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palm Payment: ఇదెక్కడి టెక్నాలజీ సుధా.. అరచేతితో చెల్లింపులు

సాంకేతిక, మౌలిక రంగాల్లో దూసుకెళ్తూ ప్రపంచ దేశాలకే సవాలు విసురుతున్న చైనా.. ప్రస్తుతం 2050లో ఉందని అని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి అరచేతితో సూర్యోదయాన్ని ఆపలేం కానీ... డబ్బులు మాత్రం చెల్లించచ్చు అని చైనా నిరూపించింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Palm Payment: ఇదెక్కడి టెక్నాలజీ సుధా.. అరచేతితో చెల్లింపులు
China Palm Payment
Ram Naramaneni
|

Updated on: Oct 27, 2024 | 5:31 PM

Share

ఇక నుంచి పేమెంట్‌ చేయడానికి ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఏంలతో పని లేదు. జస్ట్‌ హ్యాండ్‌ స్కాన్‌తో పనైపోతుంది. యస్‌..! మీరు ఇప్పటి వరకు చూసిన టెక్నాలజీ అంతా ఒక ఎత్తు.. ఇప్పుడు మనం మాట్లాడుకునే టెక్నాలజీ మరో ఎత్తు.  డిజిటల్‌ పేమెంట్‌లో ఇది నెక్ట్స్‌ లెవల్‌. ఇక నుంచి బిల్‌ పేమెంట్‌ చేయడానికి మీ అరచేతిని ఉపయోగిస్తే చాలు. పేమెంట్‌ అయిపోతుంది. వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా… ఇది కళ్ల ముందు కనిపిస్తున్న నిజం. ప్రస్తుతం టెండ్ర్‌ అవుతున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి డీటెల్‌గా తెలుసుకుందాం.. మారుతున్న టెక్నాలజీతో బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.  బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం చాలా ఈజీ అయిపోయింది. గతంలో డబ్బులు, చెక్‌ల ద్వారా నగదు చెల్లింపు జరిగేది. ఆ తర్వాత డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది. డిబిట్‌ కార్డులతో డబ్బులు పే చేశాం. ఇప్పుడు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఏంల హవా నడుస్తోంది. ఇప్పుడు అరచేతితో చెల్లింపులు జరుగుతున్నాయి.

షాపింగికి వెళ్తే… డబ్బులు చెల్లించడానికి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుతోనో, యూపీఐ యాప్స్‌ల అవసరం ఉండదు. కేవలం అరచేతితో చెల్లింపులు చేయవచ్చు. స్కానర్‌ ముందు అరచేతిని ఉంచితే చాలు. రెండు మూడు సెకన్లలోనే పేమెంట్ అయిపోతుంది.  ఈ న్యూ టెక్నాలజీ ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. అక్కడి జనాలంతా అరచేతితో చెల్లింపులు చేస్తున్నారు. ఏ షాపింగ్‌కి వెళ్లినా హాండ్‌ స్కాన్‌ చేసి బిల్‌ పే చేస్తున్నారు. షాపింగ్‌ మాల్‌లోని బిల్‌ కౌంటర్స్‌ దగ్గర క్యూ తగ్గింది. వేయిటింగ్‌ లేదు. జస్ట్‌ అరచేతిని చూపించి వెళ్లిపోతున్నారు. పామ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ అందరికి అందుబాటులోకి వస్తే యూపీఐ చెల్లింపులకు కూడా కాలం చెల్లినట్లే.

మరి ఇది ఎలా పని చేస్తుంది..? స్కానర్‌కి అరచేతికి లింక్‌ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.  అరచేతి ద్వారా చెల్లింపులు చేయాలంటే… దీని ప్రాసెస్‌ అంతా యూపీఐ యాప్స్‌ తరహాలోనే ఉంది. ఏం లేదు… జస్ట్‌ పామ్‌ ప్రింట్‌ డివైజ్‌లో మీ హ్యాండ్‌ని స్కాన్‌ చేసి రిజిస్టర్‌ అవ్వాలి.ఆ తర్వాత దాన్ని మన పేమెంట్‌ ఇన్ఫర్మేషన్‌కి లింక్‌ అప్‌ చేస్తే చాలు. థంబ్‌ సిస్టమ్‌ ఎలా ఉంటుందో సేమ్‌ అలాగే. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డుతో ఎలా అయితే మన ఫింగర్‌ ప్రింట్స్‌ లింక్‌ అయి ఉంటాయో.. అలాగే మన అరచేతి నకలు మన బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబర్‌తో లింక్‌ అయిపోతుంది.ఒకసారి రిజిస్ట్రేషన్‌ పూర్తయితే.. ఎక్కడైనా కేవలం అరచేతిని ఉపయోగించి నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..