OTT Movie: సీన్‌ సీన్‌కు గుండె ఆగాల్సిందే.. భయంతో ప్యాంట్ తడిపేస్తారు.. ధైర్యమునోళ్లే చూడండి

ఓటీటీలలోకి ప్రతీ వారం ఎన్నో హారర్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. సాధారణంగా హారర్ జోనర్‌కు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. అదే హారర్‌తో పాటు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటే.. ఇక ఆ సినిమా సూపర్ అనమాటే.. ఆ వివరాలు..

OTT Movie: సీన్‌ సీన్‌కు గుండె ఆగాల్సిందే.. భయంతో ప్యాంట్ తడిపేస్తారు.. ధైర్యమునోళ్లే చూడండి
Ott Movie
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 26, 2024 | 4:08 PM

సాధారణంగా హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీల్లో హారర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. అందులోనూ దెయ్యం కాన్సెప్ట్‌తో వచ్చే స్టోరీలు అయితే.. మూవీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. మరి దెయ్యంతో పాటు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే.. అలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఒకటి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అసలేంటి.? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..

స్టోరీ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోయిన్ ఓ రైటర్.. క్రైమ్ థ్రిల్లర్ కథలను రాస్తూ మ్యాగజైన్‌లకు పంపిస్తూ ఉంటుంది. అలా ప్రచురితమైన కథల ద్వారా ఫేమస్ అవుతుంది. ఈ క్రమంలోనే అభిమానులు.. ఆమెకు కొన్ని స్టోరీలను పంపుతూ ఉంటారు. అలా ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కుబు అనే అమ్మాయి పంపిన కథను హీరోయిన్ చదువుతుంది. ఆ కథలో ఓ ఇంజనీరింగ్ అమ్మాయి దెయ్యాల ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. రాత్రి అయితే చాలు వింత వింత శబ్దాలు ఆమెకు వినిపిస్తుంటాయి. ఈ విషయాన్ని తన భర్తకు కూడా చెబుతుంది. అలాగే రాత్రిపూట తీసిన కొన్ని ఫోటోలలో ఏవో వింత ఆకారాలు కనిపిస్తాయి. అలాగే అదే అపార్ట్‌మెంట్‌లోని 405 ఫ్లాట్ నుంచి హీరోయిన్‌కు కొన్ని లెటర్స్ వస్తాయి. ఆ ఫ్లాట్‌లో ఓ ఫ్యామిలీ ఉంటుంది.

ఇక అందులోని ఓ అబ్బాయి ఎప్పుడూ ఒక బొమ్మను తీసుకుని అపార్ట్‌మెంట్ పైకి వెళ్లి.. దాని మెడకు తాడు కట్టి లాగుతూ ఉంటాడు. అతడికి దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ అబ్బాయి ప్రవర్తనకు అతడి తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. ఇలా ఆ లెటర్స్ చదువుతున్న హీరోయిన్‌కు ఒక్కసారిగా ఓ షాకింగ్ సంఘటన ఎదురవుతుంది. ఇంతకీ అదేం సంఘటన.? అసలు ఆ అపార్ట్‌మెంట్‌కు.? హీరోయిన్‌కు మధ్య లింక్ ఏంటి.? ఆ దెయ్యాల గోలేంటి.? అనే విషయాలు తెలియాలంటే ‘ది ఇనరజబుల్’ సినిమా చూడాల్సిందే. గుండె ధైర్యం ఉన్నోళ్లు మాత్రమే ఈ సినిమా చూడాలి. ప్రతీ సీన్ భయపెట్టే విధంగా ఉంటుంది. కాగా, ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

సినిమా ట్రైలర్ కింద చూడండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి