Singham Vs Bhool: దివాళికి భూల్ భూలయ్యా 3.. సింగం అగైన్‌.. వీటిలో ఎవరిది పైచేయి.?

బాలీవుడ్‌లో ఆ రెండూ క్రేజీ ఫ్రాంచైజీలే..! వాటి ముందు భాగాలు బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేసాయి.. ఇప్పుడలాంటి సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. అనుకోకుండా ఆ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్‌లోనే విడుదలకు సిద్ధమయ్యాయి. దాంతో ఈ రెండింటి మధ్య ఆసక్తికరమైన సమరానికి రంగం సిద్ధమైంది. మరి వీటిలో ఎవరిది పైచేయి కాబోతుంది..?

Prudvi Battula

|

Updated on: Oct 26, 2024 | 2:56 PM

బాలీవుడ్‌లో ఈ వీకెండ్ రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. దివాళికి బాక్సాఫీస్ దగ్గర క్రాకర్స్ పేల్చడానికి రెండు సీక్వెల్స్ వస్తున్నాయి. వాటి మధ్య పోరు ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఒక్కరోజు గ్యాప్‌లో భూల్ భూలయ్యా 3తో పాటు సింగం అగైన్ విడుదల కానున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలకు అదిరిపోయే క్రేజ్ ఉంది.

1 / 5
రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న కాప్ యూనివర్స్ సింగం అగైన్‌పై ముందు నుంచే చర్చ బాగా జరుగుతుంది. దానికితోడు 5 నిమిషాల ట్రైలర్ విడుదల చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది.

2 / 5
రామాయణానికి ముడిపెడుతూ ఈ కథ రాసుకున్నారు రోహిత్ శెట్టి. ఈ కాప్ యూనివర్స్‌లో అజయ్ దేవ్‌గన్‌తో పాటు అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నారు. నవంబర్ 1న విడుదల కానుంది సింగం అగైన్. 

3 / 5
  సింగం అగైన్ విడుదలకి ఒక్కరోజు ముందు హారర్ మూవీ భూల్ భులయ్యా 3 వస్తుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యా బాలన్, మాధురి దీక్షిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

4 / 5
రెండేళ్ళ కింద వచ్చిన పార్ట్ 2 బ్లాక్‌బస్టర్ కావడంతో.. భూల్ భులయ్యా 3పై అంచనాలు బాగానే ఉన్నాయి. అక్టోబర్ 31న రానుంది ఈ చిత్రం. ఈ రెండు సీక్వెల్స్‌లో ఏది నిలబడుతుందో చూడాలి.

5 / 5
Follow us