GT IPL 2025: గిల్, రషీద్‌ ఖాన్ కింగ్ మేకర్‌‌లు.. లిస్టులో ఊహించని పేర్లు.. గుజరాత్ రిటైన్ ఇదే

గుజరాత్ టైటాన్స్ రిటైన్ లిస్టు వచ్చేసింది. టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్ తన పేచెక్‌ను తగ్గించుకున్నాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫ్రాంచైజీ రిటైన్ లిస్టులో మొదటి ప్లేయర్ కాగా.. ఆ తర్వాత శుభ్‌మాన్ గిల్, సుదర్శన్, రాహుల్ టేవాటియా, షారూఖ్ ఖాన్ లిస్టులో ఉన్నారు.

GT IPL 2025: గిల్, రషీద్‌ ఖాన్ కింగ్ మేకర్‌‌లు.. లిస్టులో ఊహించని పేర్లు.. గుజరాత్ రిటైన్ ఇదే
Gt
Follow us

|

Updated on: Oct 31, 2024 | 9:32 PM

గుజరాత్ టైటాన్స్ రిటైన్ లిస్టు వచ్చేసింది. టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్ తన పేచెక్‌ను తగ్గించుకున్నాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫ్రాంచైజీ రిటైన్ లిస్టులో మొదటి ప్లేయర్ కాగా.. ఆ తర్వాత శుభ్‌మాన్ గిల్, సుదర్శన్, రాహుల్ టేవాటియా, షారూఖ్ ఖాన్ లిస్టులో ఉన్నారు. టాప్ ఆర్డర్‌లో గిల్‌తో పాటు మరో బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఫ్రాంచైజీ రూ. 8.5 కోట్లతో అట్టిపెట్టుకుంది. ఇక గత కొన్ని నెలలుగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ పేసర్ మహమ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ వదిలిపెట్టింది. గత రెండు సీజన్లలో ఫ్రాంచైజీకి 40 వికెట్లు తీసిన పేసర్ మోహిత్ శర్మను కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించలేదు. బదులుగా, IPL 2025 మెగా వేలానికి ముందు మిడిల్ ఆర్డర్ పవర్‌హిటర్లు రాహుల్ టేవాటియా, షారూఖ్ ఖాన్‌లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లుగా ఉంచుకోవాలని GT నిర్ణయించింది. అటు వెటరన్ సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను గుజరాత్ టైటాన్స్ విడుదల చేయడం గమనార్హం.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

ఇవి కూడా చదవండి

రిటైన్ ఆటగాళ్ళు:

1. రషీద్ ఖాన్ (రూ. 18 కోట్లు)

2. శుభమాన్ గిల్ (రూ. 16.5 కోట్లు)

3. బి సాయి సుదర్శన్ (రూ. 8.5 కోట్లు)

4. రాహుల్ టేవాటియా (రూ. 4 కోట్లు – అన్‌క్యాప్డ్)

5. షారూఖ్ ఖాన్ (రూ. 4 కోట్లు – అన్‌క్యాప్డ్)

పర్స్ బడ్జెట్: రూ. 69 కోట్లు

అందుబాటులో ఉన్న RTMలు: 1

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

గుజరాత్ రిలీజ్ ప్లేయర్స్:

ఉమేశ్ యాదవ్, అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, వృద్దిమాన్ సాహా, దర్శన్ నల్కండే, సాయి కిషోర్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, బీబీ శరత్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగీ, మానవ్ సుతార్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, జోష్ లిటిల్, నూర్ అహ్మద్, అజ్ముతుల్లా ఒమర్జాయ్, స్పెన్సర్ జాన్సన్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..