AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: దళపతి విజయ్‌తో నటించిన ఈ బ్యూటీ ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ.. దళపతి విజయ్ నటించిన చిత్రమిదే. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నటించిన ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, మీనాక్షి చౌదరీ కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఇందులో విజయ్ చెల్లిగా నటించిన చిన్నది గుర్తుందా.?

Tollywood: దళపతి విజయ్‌తో నటించిన ఈ బ్యూటీ ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే
Tollywood 1
Ravi Kiran
|

Updated on: Oct 28, 2024 | 12:24 PM

Share

రాజకీయాల్లోకి వెళ్లే ముందు తమిళ హీరో దళపతి విజయ్ నటించిన చిత్రం ‘గోట్- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్.. కొడుకు, తండ్రిగా రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఈ మూవీలో స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అటు తమిళంలో హిట్ కాగా.. తెలుగులో యావరేజ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విజయ్ చెల్లి పాత్రలో నటించిన చిన్నది గుర్తుందా.? జీవిత గాంధీ అనే పాత్రలో నటించిన ఆ అమ్మడు పేరు అభ్యుక్త మణికందన్. ఈమెకు ఇదే మొదటి చిత్రం కాగా.. బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే షాక్ కావడం ఖాయం. అదేంటో తెలుసుకుందామా..

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

క్లాసికల్ డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అభ్యుక్త మణికందన్.. తన సినీ కెరీర్‌ను దళపతి విజయ్ నటించిన ‘గోట్- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మూవీతో స్టార్ట్ చేసింది. ఇందులో విజయ్ చెల్లిగా నటించిన ఈ చిన్నది.. తన నటనకు గానూ మంచి మార్కులు దక్కించుకుంది. ఇక చెన్నైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మణికందన్ కుమార్తె. ‘అన్నియన్’, ‘ఓం శాంతి ఓం’, ‘బ్రహ్మాస్త్ర’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

లా డిగ్రీలో పట్టా పుచ్చుకున్న అభ్యుక్త.. మొదటిగా భరతనాట్యం నేర్చుకుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోని వివిధ స్టేజిలపైనా ఈమె డ్యాన్స్ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. వివిధ యాడ్స్, ఫోటోషూట్స్ చేసింది. అలా 2024లో ఈమెకు దళపతి విజయ్ ‘గోట్- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. లేట్ ఎందుకు ఆమె ఫోటోలపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి