Tollywood: సమంతాతో నటించిన ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్.. అందాలు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

సమంతా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'యశోద'. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ సాధించనప్పటికీ.. సామ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది. ఇక ఈ చిత్రంలో సమంతాతో పాటు నలుగురు హీరోయిన్లు నటించారు. వారెవరో తెల్సా

Tollywood: సమంతాతో నటించిన ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్.. అందాలు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 27, 2024 | 8:07 PM

సమంతా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘యశోద’. లేడీ ఓరియెంటెడ్‌గా రూపొందిన ఈ చిత్రం 2022, నవంబర్ 11న విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. సరోగసి కథాంశంతో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో సమంతా నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి. మొదట ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా.. చివరికి మిక్స్డ్ టాక్‌తో కలెక్షన్లు సోసోగానే వచ్చాయి. ఇక ఇందులో సమంతాతో పాటు మరో నలుగురు హీరోయిన్లు నటించారు. ఆ లిస్టులో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియాంక శర్మ, కల్పిక గణేష్, నైరా బెనర్జీ ఉన్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. ఇక పైన పేర్కొన్న ఫోటోను చూశారా.! హీరోయిన్ సమంతా ప్రక్కన ఉన్న అమ్మడు మీకు గుర్తుందా.? ఆమె టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టారా.?

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

ఆమె మరెవరో కాదు.. ప్రియాంక శర్మ. బీహార్‌లో పుట్టి పెరిగిన ఈ భామ.. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ డిగ్రీలో పట్టాలో పొందింది. మోడలింగ్ ద్వారా తన కెరీర్ స్టార్ట్ చేసి.. ‘బంధం రేగడ్’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘అనగనగా ఓ ఊరిలో’, ‘మిస్టర్ హోమానంద్’ అనే చిత్రాలు చేసింది. ‘శివ కాశీపురం’, ‘తరువాత ఎవరు’, ‘మేరా భారత్ మహాన్’, ‘సవారి’, ‘బొమ్మల కొలువు’, ‘డై హార్డ్ ఫ్యాన్’, ‘మెన్ టూ’, ‘తంతిరం’ వంటి సినిమాల్లో కనిపించింది ఈ భామ. ఇక తాజాగా ‘పోట్టేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది ప్రియాంక శర్మ. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక శర్మ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. లేట్ ఎందుకు మీరూ వాటిపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి