AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza-Mohammed Shami: సానియా మీర్జాతో రెండో పెళ్లి.. తొలిసారిగా స్పందించిన టీమిండియా క్రికెటర్ షమీ

షమీపై ఆమె ఎన్నో ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది జహీన్. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఒంటరిగానే ఉంటున్నాడీ టీమిండియా స్టార్ పేసర్. అయితే గత కొన్ని నెలలుగా మహ్మద్ షమీ రెండో పెళ్లి చేసుకోనున్నాడంటూ పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో విడాకులు తీసుకున్న టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాతో షమీ నిఖా చేసుకోనున్నాడంటూ రూమర్లు సృష్టించారు నెటిజన్లు.

Sania Mirza-Mohammed Shami: సానియా మీర్జాతో రెండో పెళ్లి.. తొలిసారిగా స్పందించిన టీమిండియా క్రికెటర్ షమీ
Mohammed Shami, Sania Mirza
Basha Shek
|

Updated on: Jul 20, 2024 | 11:21 AM

Share

వన్డే వరల్డ్ కప్-2023 లో అద్భుతంగా రాణించాడు టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ. అయితే ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్‌ సాధిస్తున్నాడు. జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. క్రికెట్ సంగతి పక్కన పెడితే.. షమీ తన భార్య హసిన్ జహాన్‌తో విడిపోయాడు. షమీపై ఆమె ఎన్నో ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది జహీన్. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఒంటరిగానే ఉంటున్నాడీ టీమిండియా స్టార్ పేసర్. అయితే గత కొన్ని నెలలుగా మహ్మద్ షమీ రెండో పెళ్లి చేసుకోనున్నాడంటూ పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో విడాకులు తీసుకున్న టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాతో షమీ నిఖా చేసుకోనున్నాడంటూ రూమర్లు సృష్టించారు నెటిజన్లు. వీటిపై సానియా మీర్జా స్పందించలేదు కానీ ఆమె తండ్రి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వదంతులు సృష్టించద్దు అంటూ నెటిజన్లను కోరాడు. ఇప్పుడు సానియా మీర్జాతో పెళ్లిపై మహమ్మద్ షమీ కూడా స్పందించాడు. ప్రముఖ జర్నలిస్ట్ తో పొడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను సానియాతో పెళ్ల రూమర్లతో పాటు ఇలాంటి రూమర్లను క్రియేట్ చేస్తోన్న నెటిజన్లను ఏకిపారేశాడు.

దమ్ముంటే…

‘సానియా మీర్జాతో పెళ్లి అనేద కేవలం రూమర్స్ మాత్రమే. గుర్తింపు లేని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి ఇలాంటి పోస్టు చేస్తుంటారు. దమ్ముంటే నిజమై అకౌంట్ నుంచి ఇలాంటి పోస్టులు చేయండి. అప్పుడు నేనేంటో చూపిస్తా. ఇప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంది. ఎవరో ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్లినంత మాత్రనా అంత సర్వనాశనం కాదు. ఇప్పుడు నా కూతురు, మా అమ్మతో హ్యపీగా లైఫ్ ను లీడ ్చేస్తున్నాను. సోషల్‌ మీడియాలో ఇలాంటి పుకార్లు పుట్టించే వాళ్లు.. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగత జీవితాల విషయానికి రావొద్దు. ఫన్‌, మీమ్‌ అంటే వేరే విషయాల్లో చేసుకోవచ్చు. కానీ ఇలా ఒకరి వ్యక్తిగత జీవితాన్ని ఇంకొకరితో ముడివేస్తూ బజారుకి లాగవద్దు’ అంటూ నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు షమీ. తద్వారా సానియాతో తన పెళ్లంటూ వస్తోన్న రూమర్లను కొట్టిపారేశాడు.

ఇవి కూడా చదవండి

మహ్మద్ షమీ కూతురు..

రీ ఎంట్రీకి రెడీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి