- Telugu News Photo Gallery Cricket photos Indian Cricketer Deepak Hooda marries his longtime girlfriend, Shares wedding photos
Deepak Hooda: ప్రియురాలితో పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ చూశారా? కొత్త జంట ఎంత క్యూట్‌గా ఉందో!
టీమిండియా యంగ్ క్రికెటర్ దీపక్ హుడా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. సోమవారం (జులై 15)న తమ వివాహం జరిగిందంటూ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Updated on: Jul 20, 2024 | 9:32 AM

టీమిండియా యంగ్ క్రికెటర్ దీపక్ హుడా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. సోమవారం (జులై 15)న తమ వివాహం జరిగిందంటూ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు

ప్రస్తుతం దీపక్ హుడా దంపతుల పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. దీంతో పలువురు టీమిండియా క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు దీపక్ హుడా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల, ప్రతీ సంభాషణ మనల్ని ఈరోజు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి' అంటూ ఈ సందర్భంగా తన సతీమణిపై ప్రేమను కురిపించాడు దీపక్ హుడా.

'మా కళ్లలోని భావాలు.. మేము చెప్పుకొనే ముచ్చట్లు కేవలం మా రెండు మనసులకు మాత్రమే అర్థమవుతాయి. నా చిన్నారి- పొన్నారి హిమాచలి అమ్మాయీ.. మా ఇంట్లోకి నీకు స్వాగతం పలుకుతున్నా' అంటూ ఎమోషనల్ అయ్యాడీ టీమిండియా క్రికెటర్.

ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ.. అందరి ఆశీర్వాదాలతో తాము కొత్త జీవితం మొదలుపెట్టామని తన సోషల్ మీడియా పోస్టులో చెప్పుకొచ్చాడు దీపక్ హుడా.

ప్రస్తుతం దీపక్ హుడా పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు.. 'కొత్త జంట ఎంతో క్యూట్ గా ఉంది' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




