Aishwarya Rai: ‘ విడాకులు అంత ఈజీ కాదు’.. ఐశ్వర్యతో విడిపోవడంపై అభిషేక్ క్లారిటీ ఇచ్చేశాడా?

అందాల తార ఐశ్వర్యారాయ్, హీరో అభిషేక్ బచ్చన్ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇవి రూమర్లే అయినా ఎవరూ వీటిని ఖండించడం లేదు. దీనికి తోడు ఈ మధ్యన ఐశ్వర్య, అభిషేక్ ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హజరయ్యారీ లవ్లీ కపుల్

Aishwarya Rai: ' విడాకులు అంత ఈజీ కాదు'.. ఐశ్వర్యతో విడిపోవడంపై అభిషేక్ క్లారిటీ ఇచ్చేశాడా?
Aishwarya Rai Family
Follow us
Basha Shek

|

Updated on: Jul 18, 2024 | 11:50 AM

అందాల తార ఐశ్వర్యారాయ్, హీరో అభిషేక్ బచ్చన్ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇవి రూమర్లే అయినా ఎవరూ వీటిని ఖండించడం లేదు. దీనికి తోడు ఈ మధ్యన ఐశ్వర్య, అభిషేక్ ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హజరయ్యారీ లవ్లీ కపుల్. ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో కలిసి ఈ వివాహానికి హాజరైంది. మరోవైపు అభిషేక్ మాత్రం అమితాబ్, జయ బచ్చన్ తో కలిసి అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. ఇలా వీరిద్దరూ విడివిడిగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఐశ్వర్య- అభిషేక్ ల విడాకుల రూమర్లు మళ్లీ మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పని విడాకుల వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. అదేంటంటే.. తాజాగా ‘ విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదన్న పోస్ట్‌ను అభిషేక్ బచ్చన్ లైక్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ప్రముఖ రచయిత్రి హీనా ఖండేవాలా ఒక పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ విడాకుల గురించి. దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జీవితం సాగదు. దశాబ్దాలుగా కలిసి ఉన్న తర్వాత కూడా విడిపోవాల్సి వస్తుంది. విడిపోయిన తర్వాత, ముఖ్యమైన విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడే వారు ఎలా ఉంటారు? బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది? వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం’ అని ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. దీనికి అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అభిషేక్ జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అనంత్ అంబానీ పెళ్లిలో కూతురిలో ఐశ్వర్య రాయ్ బచ్చన్.. వీడియో

2007లో ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ ల వివాహం జరిగింది. ఇప్పుడు ఈ దంపతులకు ఆరాధ్య అనే కూతురు ఉంది. ప్రస్తుతం ఐశ్వర్య నే తన కూతురిని పెంచే బాధ్యతను తీసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.