Kapil Dev: కపిల్ దేవ్ పక్కనున్నదెవరో గుర్తు పట్టారా? అరెరె.. ఆ బాహుబలి ఏంటిలా మారిపోయాడు

ఇందులో కపిల్ దేవ్ ను ఈజీగానే గుర్తు పట్టిన నెటిజన్లు.. ఆయన పక్కన మరొక వ్యక్తి ని చూసి అసలు నమ్మలేకపోతున్నామంటున్నారు. ఈయన కూడా కపిల్ లాగే దిగ్గజ క్రికెటర్. అయితే ఆయన అప్పటి రూపానికి.. ఇప్పటి రూపానికి భారీ వ్యతాసం ఉంది. అప్పట్లో బాహుబలిలా భారీ కాయంతో కనిపించిన ఈ దిగ్గజం ఇప్పుడు ఇలా బక్కచిక్కిపోయాడు.

Kapil Dev: కపిల్ దేవ్ పక్కనున్నదెవరో గుర్తు పట్టారా? అరెరె.. ఆ బాహుబలి ఏంటిలా మారిపోయాడు
Kapil Dev
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2024 | 11:44 AM

పై ఫొటోలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇందులో కపిల్ దేవ్ ను ఈజీగానే గుర్తు పట్టిన నెటిజన్లు.. ఆయన పక్కన మరొక వ్యక్తి ని చూసి అసలు నమ్మలేకపోతున్నామంటున్నారు. ఈయన కూడా కపిల్ లాగే దిగ్గజ క్రికెటర్. అయితే ఆయన అప్పటి రూపానికి.. ఇప్పటి రూపానికి భారీ వ్యతాసం ఉంది. అప్పట్లో బాహుబలిలా భారీ కాయంతో కనిపించిన ఈ దిగ్గజం ఇప్పుడు ఇలా బక్కచిక్కిపోయాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. కపిల్ దేవ్ తో ఉన్న ఈ దిగ్గజ క్రికెటర్ మరెవరో కాదు.. శ్రీలంకను వరల్డ్ కప్ విజేతగా నిలిచిన కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ అర్జున రణతుంగ. ఇటీవల ఆయన కపిల్ దేవ్ ను కలిశారు. సరదాగా ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్తా నెట్టింట వైరలవుతున్నాయి. ఇందులో అర్జున్‌ రణతుంగను చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ’90వ దశకంలో క్రికెట్ మైదానంలో బాహుబలిలా కనిపించిన అర్జున రణతుంగ ఇప్పుడేంటి ఇలా మారిపోయారు? ఆయనకు ఏమైంది? అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా శ్రీలంక క్రికెట్ జట్టుకు కెప్టెన్ గానూ, ఆటగాడిగానూ సేవలందించారు అర్జున రణతుంగ. 1982 నుంచి 2000 సంవత్సరం వరకు లంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రణతుంగ 269 వన్డేల్లో 7456 పరుగులు సాధించాడు. అలాగే 93 టెస్టుల్లో 5105 పరుగులు సాధించాడు. స్పిన్నర్ గానూ రాణించిన ఆయన టెస్టుల్లో 16, వన్డేల్లో 79 వికెట్లు కూడా ఉన్నాయి. ఇక శ్రీలంక జట్టు 1996 వన్డే ప్రపంచకప్ గెల్చుకోవడంలో అర్జున రణతుంగది కీలక పాత్ర. ఆ టోర్నీమెంట్ లో కెప్టెన్ గానూ, ఆటగాడిగానూ అద్భుతంగా రాణించాడీ దిగ్గజ ప్లేయర్. ఇక క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అర్జున్‌ రణతుంగ రాజకీయాల్లో ప్రవేశించాడు. శ్రీలంక పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రజా సేవలో నిమగ్నమయ్యాడు

ఇవి కూడా చదవండి

కాగా మరికొన్ని రోజుల్లో శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్లు అర్జున్‌ రణతుంగ- కపిల్‌ దేవ్‌ ఫొటో తెరమీదకు రావడం విశేషం. శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లలు ఆడనుంది. ఇరు జట్ల మధ్య జూలై 27న తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ పర్యటనతోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ ప్రస్థానం మొదలుకానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..