AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Suriya: అభిమానులతో కలిసి రక్తదానం చేసిన హీరో సూర్య.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడుగా.. వీడియో వైరల్

హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసేందుకు రెడీ అయిపోతుంటారు అభిమానులు. అలాగే అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. అలా తాజాగా సూర్య పుట్టిన రోజును పురస్కరించుకుని అతని అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం (జులై 16) ఈ రక్తదాన శిబిరాన్ని నేడు సూర్య సందర్శించాడు

Actor Suriya: అభిమానులతో కలిసి రక్తదానం చేసిన హీరో సూర్య.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడుగా.. వీడియో వైరల్
Actor Suriya
Basha Shek
|

Updated on: Jul 16, 2024 | 1:12 PM

Share

హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసేందుకు రెడీ అయిపోతుంటారు అభిమానులు. అలాగే అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. అలా తాజాగా సూర్య పుట్టిన రోజును పురస్కరించుకుని అతని అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం (జులై 16) ఈ రక్తదాన శిబిరాన్ని నేడు సూర్య సందర్శించాడు. అంతేకాదు అభిమానులతో కలిసి అతను కూడా రక్తం ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. సూర్య పుట్టిన రోజు (జులై 23) వరకు తమిళనాడు అంతటా ఈ రక్తదాన శిబిరాలు కొనసాగనున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్య అభిమానులు. ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. అలా గతేడాది కూడా సుమారు 2000 మందికి పైగా అభిమానులు రక్తదానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఆ సమయంలో వీడియో కాల్ ద్వారా అభిమానులతో ముచ్చటించి వారిని అభినందించాడు. అంతేకాదు 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి హాజరవుతానని మాట ఇచ్చాడు.

ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ రక్తదాన శిబిరానికి వెళ్లి.. తాను కూడా రక్తం ఇచ్చాడు. అనంతరం ఫ్యాన్స్ తో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ సూర్యతో పాటు అతని అభిమానులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆన్ స్క్రీన్ పై ఎంతో స్టైలిష్ గా కనిపించే సూర్య ఈ రక్తదాన శిబిరంలోనూ ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించాడు.

ఇవి కూడా చదవండి

అభిమానులతో కలిసి రక్తదానం చేస్తోన్న హీరో సూర్య.. వీడియో ఇదిగో..

క సినిమాల విషయానికి వస్తే.. సూర్య హీరోగా నటించిన కంగువ చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దీంతోపాటు వాడీ వసూల్ సినిమా కూడా షూటింగ్ జరుపుకొంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..