AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ నాన్నకూచిని గుర్తు పట్టారా? ఈ అమ్మడి నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్

తాజాగా ఓ స్టార్ హీరోయిన్ వాళ్ల నాన్న 60వ పుట్టిన రోజు సందర్భంగా ఒక క్యూట్ ఫొటో షేర్ చేసింది. చిన్నప్పుడు తనని వాళ్ల నాన్న ఎత్తుకున్న ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకుంటూ బర్త్ డే విషెస్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. మరి ఇందులో ఉన్న ఆ పాప ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: ఈ నాన్నకూచిని గుర్తు పట్టారా? ఈ అమ్మడి నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్
Tollywood Actress Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 15, 2024 | 9:18 AM

Share

ఈ మధ్యన సినీ, క్రీడా ప్రముఖుల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తమ పుట్టిన రోజు లేదా కుటుంబ సభ్యుల బర్త్ డే ల సందర్భంగా చాలా మంది తమ ఛైల్డ్ హుడ్ ఫొటోలను షేర్ చేసి విషెస్ చెబుతుంటారు చాలా మంది సెలబ్రిటీలు. అలా తాజాగా ఓ స్టార్ హీరోయిన్ వాళ్ల నాన్న 60వ పుట్టిన రోజు సందర్భంగా ఒక క్యూట్ ఫొటో షేర్ చేసింది. చిన్నప్పుడు తనని వాళ్ల నాన్న ఎత్తుకున్న ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకుంటూ బర్త్ డే విషెస్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. మరి ఇందులో ఉన్న ఆ పాప ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకు ఒక క్లూ.. ఈ స్టార్ హీరోయిన్ అందం, అభినయానికి ఫిదా అయిన అభిమానులు ఆమెకు ఏకంగా లేడీ పవర్ స్టార్ బిరుదును ఇచ్చారు. ఇప్పుడు గుర్తొచ్చిందా ఆమె ఎవరో? యస్..ఈ పాప మరెవరో కాదు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని సాయి పల్లవి తాజాగా తన తండ్రి సెంతామరై కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. తన చిన్న నాటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. ’60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్న. మాకు ఇంతటి ప్రశాంతమైన జీవితం ఇచ్చినందుకు చాలా థ్యాంక్యూ. మీ జీన్స్ నుంచి ఫుట్ బాల్ ఆడటానికి బలమైన కాళ్లు ఇచ్చినందుకు థ్యాంక్యూ. చాలా సెన్సిటివ్ గా ఉండే మమ్మల్ని ఇంత స్ట్రాంగ్ గా మార్చినందుకు, నాకు, పూజాకు స్ఫూర్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టులో వాళ్ల నాన్నకు సంబంధించిన మరిన్ని పాత ఫొటోలను కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఇప్పుడే కాదు చిన్నప్పుడు కూడా సాయి పల్లవి ఎంతో క్యూట్ గా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

డాక్టర్ పట్టా అందుకుంటోన్న సాయి పల్లవి.. వీడియో

తండేల్ సినిమాలో సాయి పల్లవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కిరాణా షాపులో ఒంటరిగా ఉన్న మహిళ.. బైక్‌పై వచ్చిన ముగ్గురు..
కిరాణా షాపులో ఒంటరిగా ఉన్న మహిళ.. బైక్‌పై వచ్చిన ముగ్గురు..
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్