AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:ఈ టీనేజ్ కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. డ్యాన్సుల్లో నెక్ట్స్ లెవెల్ అంతే

పై ఫొటోలో సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి ధగధగలా మెరిసిపోతోన్న ఈ టీనేజీ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. లవ్, రొమాంటిక్, యాక్షన్ సినిమాలు చేస్తూ క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు

Tollywood:ఈ టీనేజ్ కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. డ్యాన్సుల్లో నెక్ట్స్ లెవెల్ అంతే
Tollywood Hero Teenage Photo
Follow us
Basha Shek

|

Updated on: Jul 14, 2024 | 1:20 PM

పై ఫొటోలో సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి ధగధగలా మెరిసిపోతోన్న ఈ టీనేజీ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. లవ్, రొమాంటిక్, యాక్షన్ సినిమాలు చేస్తూ క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఓ ప్రముఖ నిర్మాత వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను హీరోగా మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కొన్ని ప్లాఫులు ఎదురైనా ధైర్యంతో నిలబడ్డాడు. తన ఎనర్జిటిక్ యాక్టింగ్, డ్యాన్స్ లతో యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. గతంలో ఎక్కువగా క్లాస్ సినిమాలు చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో ఈ మధ్యన ఎక్కువగా మాస్ సినిమాల్లోనే కనిపిస్తున్నాడు. త్వరలోనే ‘స్టెప్పామార్’ అంటూ మళ్లీ మన ముందుకు రానున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. మరి ఇతనెవరో చాలా మంది గుర్తు పట్టేసే ఉంటారు. ఎస్. ఈ కుర్రాడు మరెవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్ చరణ్. ఇది అతని టీనేజ్ నాటి ఫొటో. ఇందులో సంప్రదాయ పట్టు వస్త్రాల్లో ఎంతో అందంగా కనిపించాడు రామ్. ఇక ముఖంలో క్యూట్ స్మైల్ అయితే నెక్ట్స్ లెవెల్.

కాగా గతేడాది స్కంధ అనే సినిమాలో చివరిగా కనిపించాడు రామ్ పోతినేని. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. దీంతో తనకు ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ నే నమ్ముకున్నాడీ ఎనర్జిటిక్ స్టార్. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా పూరి దర్శకత్వంలో రామ్ నటిస్తోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. స్వాతంత్రదినోత్సవం కానుకగా ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఔ

ఇవి కూడా చదవండి

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని..

ఆగస్టు 15న ఇండిపెండెన్సె డే కానుకగా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.