AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premalo OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్.. ఊహకు అందని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే?

ఎప్పటిలాగే ఓటీటీల్లో ఈ శుక్రవారం (జులై 12) పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగు సినిమాలతో సహా వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు రిలీజయ్యాయి. వీటి స్ట్రీమింగ్ కు సంబంధించి ఆయా ఓటీటీ సంస్థలు ముందుగానే అధికారిక ప్రకటనలు అయితే ఒక సినిమా మాత్రం ఎలాంటి ముందుస్తు సమాచారం, ప్రకటన లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే ప్రేమలో.

Premalo OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్.. ఊహకు అందని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే?
Premalo Movie
Basha Shek
|

Updated on: Jul 13, 2024 | 11:28 AM

Share

ఎప్పటిలాగే ఓటీటీల్లో ఈ శుక్రవారం (జులై 12) పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగు సినిమాలతో సహా వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు రిలీజయ్యాయి. వీటి స్ట్రీమింగ్ కు సంబంధించి ఆయా ఓటీటీ సంస్థలు ముందుగానే అధికారిక ప్రకటనలు అయితే ఒక సినిమా మాత్రం ఎలాంటి ముందుస్తు సమాచారం, ప్రకటన లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే ప్రేమలో. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చందూ కోడూరి హీరోగా నటించాడు. చరిష్మా శ్రీకర్ కథానాయికగా కనిపించింది. ఇందులో హీరోగా నటించడంతో పాటు సినిమా దర్శకత్వ బాధ్యతలను భుజాన మోసుకున్నాడు చందు కొండూరి. గణ తంత్ర దినోత్సవం కానుకగా ఈ ఏడాది జనవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమాకు మంచి స్పందనే వచ్చింది. రాజమండ్రి బ్యాక్ డ్రాప్‌లో పూర్తిస్థాయి గోదావరి యాసలో ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు హీరో చందు కొండూరి. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ప్రేమలో సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ప్రకటన, సమాచారం లేకుండా శుక్రవారం (జులై 12) నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజేష్ కోడూరి నిర్మించిన ప్రేమలో సినిమాలో శివాజీరాజా, మ‌ధుసూద‌న్‌రావు కీల‌క పాత్ర‌లు పోషించారు.ఈ సినిమాకు సందీప్ కానుగుల మ్యూజిక్ అందించాడు. అలాగే రాంపీ నందిగాం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. య‌థార్థ ఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ద‌ర్శ‌కుడు చందు కొండేరి ఈ సినిమా క‌థ ను రాసుకున్నాడు. సోష‌ల్ మీడియా లో వ‌చ్చే ఫేక్ వీడియోల కార‌ణంగా కొంద‌రు అమాయ‌కులు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నార‌నే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. హీరో ర‌వి (చందు కోడూరి) ప్ర‌శాంతి (చ‌రిష్మా శ్రీక‌ర్‌) ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ప్రశాంతి మూగ అమ్మాయి. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటరా. అయితే ఇంతలో ప్ర‌శాంతితో ర‌వి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ వీడియో కార‌ణంగా ప్ర‌శాంతి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేస్తుంది. మరి ప్ర‌శాంతితో ర‌వి అలా ప్ర‌వ‌ర్తించ‌డానికి కార‌ణం ఏమిటి? ఆ వీడియో వెన‌కున్న నిజానిజాలేంటి? ర‌వి త‌న నిర్దోషిత్వాన్ని ఏ విధంగా నిరూపించుకున్నాడ‌న్న‌దే ప్రేమ‌లో సినిమా క‌థ‌.

ఇవి కూడా చదవండి

ప్రేమలో మూవీ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?