AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : సీన్ సితారైపోద్ది..! ఇదెక్కడి సినిమారా మావా.. నరాలు తెగుతాయేమో అనిపించింది

శుక్రవారం వచ్చిదంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటీలో రిలీజ్ అయ్యి అదరగొడుతున్నాయి. ఇప్పటికే చాలా రకాల జోనర్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రేక్షకులు ఎక్కువగా హారర్ మూవీస్, రొమాంటిక్ అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.థ్రిల్లర్, హర్రర్, మిస్టరీ, డిటెక్టివ్, క్రైమ్ థ్రిల్లర్స్ కు మంచి డిమాండ్ ఉంది.

OTT Movie : సీన్ సితారైపోద్ది..! ఇదెక్కడి సినిమారా మావా.. నరాలు తెగుతాయేమో అనిపించింది
Ott Movie
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 14, 2024 | 6:18 AM

Share

ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే రెట్టింపు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం వచ్చిదంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటీలో రిలీజ్ అయ్యి అదరగొడుతున్నాయి. ఇప్పటికే చాలా రకాల జోనర్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రేక్షకులు ఎక్కువగా హారర్ మూవీస్, రొమాంటిక్ అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.థ్రిల్లర్, హర్రర్, మిస్టరీ, డిటెక్టివ్, క్రైమ్ థ్రిల్లర్స్ కు మంచి డిమాండ్ ఉంది. చాలా మంది దర్శకులు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తుంది. ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది.

ఇది కూడా చదవండి : Ester Noronha: ఇండస్ట్రీలో త్వరగా ఎదగాలంటే అదే షార్ట్ కట్.. ఎవ్వరూ బలవతం పెట్టరంటున్న ఎస్తర్ నోరాన్హా

సీన్ సీన్ కు సీతరైపోతుంది ఈ సినిమా చూస్తుంటే.. నరాలు తెగే సస్పెన్స్ ఉంటుంది ఈ సినిమాలో.. ఓ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్  ఈ మూవీ. ఈ సినిమాలో ముగ్గురు స్నేహితుల దోపిడీ చేద్దామని ఒక కళ్ళు లేని వ్యక్తి ఇంట్లోకి చొరబడతారు. అయితే, చూడటానికి అమాయకంగా కనిపించే ఆ వ్యక్తి.. ఊహించని విధంగా ప్రమాదకరంగా మారిపోతాడు. దాంతో ఎరక్కబోయి వచ్చిన వారు ఇంట్లో చిక్కుకుని తమ ప్రాణాల కోసం పోరాడవలసి వస్తుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: ఈసారి బిగ్ బాస్‌లోకి రెండు జంటలు.. సపరేట్ రూమ్స్.. ఇక రచ్చ రచ్చే

ఇంతకీ ఆ ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారా.? లేదా కళ్లులేని వ్యక్తి డబ్బు దోచుకున్నారా..? అసలు ఆ కళ్ళు లేని వ్యక్తి ఎవరు.? ఎందుకు అంత క్రూరంగా మారాడు అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఆ సినిమా పేరు డోంట్ బ్రీత్. ఈ సినిమాలో స్టీఫెన్ లాంగ్ లీడ్ రోల్ చేశాడు. అవతార్ సినిమాలో కమాండర్ గా నటించింది ఇతనే.. కళ్ళు కనిపించని వ్యక్తిగా ఆయన అద్భుతంగా నటించాడు. అతను చేసే ఫైట్స్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ప్రతి సీన్ ఉత్కంఠ భరితంగా సీట్ ఎడ్జ్ లో కూర్చునేలా చేస్తుంది. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఈ సినిమాను అస్సలు మిస్ కాకండి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే మంచి వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టాప్ లో ట్రెండ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.