AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రాహుల్ ద్రవిడ్ బాటలోనే రోహిత్.. ప్రైజ్‌మనీ విషయంలో హిట్ మ్యాన్ కీలక నిర్ణయం

టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీ కానుకగా అందించింది. ఇందులో భాగంగా టీమిండియా ప్లేయర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు లభించనున్నాయి. అలాగే ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి 2.5 కోట్లు అందనుంది

Rohit Sharma: రాహుల్ ద్రవిడ్ బాటలోనే రోహిత్.. ప్రైజ్‌మనీ విషయంలో హిట్ మ్యాన్ కీలక నిర్ణయం
Rahul Dravid, Rohit Sharma
Basha Shek
|

Updated on: Jul 11, 2024 | 12:40 PM

Share

టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీ కానుకగా అందించింది. ఇందులో భాగంగా టీమిండియా ప్లేయర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు లభించనున్నాయి. అలాగే ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి 2.5 కోట్లు అందనుంది. అయితే సిబ్బంది రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు అదనపు ప్రైజ్ మనీని స్వీకరించేందుకు నిరాకరించారు. ఇతర సిబ్బంది మాదిరిగానే తనకు కూడా రూ.2.5 కోట్లు చాలన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ద్రవిడ్ బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ద్రవిడ్ బాటలోనే రోహిత్ శర్మ కూడా అడుగులు వేశాడు. ప్రైజ్ మనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే.. భారత జట్టులోని సహాయక సిబ్బందికి తక్కువ ప్రైజ్ మనీ ఇవ్వవద్దని, కావాలంటే తన ప్రైజ్ మనీలో కోత విధించమని బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని భారత జట్టు సహాయక సిబ్బంది బయటకు వెల్లడించారు. బీసీసీఐ ముందు స్టాఫ్‌కు మంచి పారితోషికం ఇవ్వాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుబట్టినట్లు తెలిసింది.

కాగా రూ. 125 కోట్ల ప్రైజ్ మనీలో.. 15 మంది టీమ్ ఇండియా, రాహుల్ ద్రవిడ్‌లకు ఒక్కొక్కరికి 5 కోట్లు అందనున్నాయి. అలాగే కోచింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి 2.5 కోట్లు లభించనున్నాయి. అదేవిధంగా, త్రోడౌన్ స్పెషలిస్టులతో సహా ఇతర సిబ్బందికి రూ.2 కోట్లు లభిస్తాయి. మరోవైపు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్ మనీని తగ్గించుకున్నాడు. బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీలో భాగంగా రాహుల్ ద్రవిడ్ రూ.5 కోట్లు అందుకోవాల్సి ఉంది. కానీ టీమ్ ఇండియా ఇతర కోచింగ్ సిబ్బందికి బీసీసీఐ రూ.2.5 కోట్లు చెల్లించింది. దీంతో అందరికీ సమానంగా ప్రైజ్ మనీ అందాలని రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్ మనీని తగ్గించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వచ్చే శ్రీలంక సిరీస్‌కు దూరం కానున్నాడు. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో మళ్లీ జట్టులో కనిపించనున్నాడు. అంతే కాకుండా, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ వరకు అతనే టీమిండియా వన్డే, టెస్ట్ జట్లకు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్