Tollywood: సడెన్‌గా సినిమాలకు గుడ్‌బై చెప్పేసి.. ఇప్పుడిలా కుమారుడితో.. ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

తెలుగులో నాగార్జున, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ తదితర హీరోలతో నటించింది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్‌ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార. అంతేకాదు వివాహానికి ముందే సినిమాలకు గుడ్ డై చెప్పేసి అభిమానులను షాక్ కు గురిచేసింది.

Tollywood: సడెన్‌గా సినిమాలకు గుడ్‌బై చెప్పేసి.. ఇప్పుడిలా కుమారుడితో.. ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jul 10, 2024 | 11:48 AM

పై ఫోటోలో బాబును ఎత్తుకుని పోజులిస్తున్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఈ అందాల తార గతంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది. పలు సూపర్ హిట్ సినిమాల్లోని స్పెషల్‌ సాంగ్స్‌లోనూ ఆడిపాడింది. హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. తెలుగులో నాగార్జున, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ తదితర హీరోలతో నటించింది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్‌ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార. అంతేకాదు వివాహానికి ముందే సినిమాలకు గుడ్ డై చెప్పేసి అభిమానులను షాక్ కు గురిచేసింది. ఆ వెంటనే తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసింది. పెళ్లి తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక భావనలోనే మునిగిపోయిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు సనాఖాన్.

ముంబైకు చెందిన సనాఖాన్ కెరీర్ ఆరంభంలో పలు హిందీ సినిమాలు, సీరియల్స్ లో నటించింది. కల్యాణ్ రామ్ కత్తి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగార్జున గగనం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ తో కలిసి మిస్టర్ నూకయ్య సినిమాలోనూ నటించింది. పలు తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. హిందీలో అయితే సల్మాన్‌ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి

2019లో విశాల్ నటించిన అయోగ్య సినిమాలో చివరి సారిగా కనిపించింది. ఆతర్వాత ఉన్నట్లుండి సినిమాల నుంచి తప్పుకుంది సనాఖాన్. దుబాయ్ కు చెందిన అనస్ సయ్యద్‌ తో కలిసి నిఖా పక్కా చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు సయ్యద్ తారిఖ్ జమీల్‌ అనే బాబు. ఎక్కువగా ఆధ్యాత్మిక యాత్రలో మునిగి తేలుతోన్న సనాఖాన్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తి దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల మక్కా యాత్రలో సానియాతో కలిసి కనిపించిన ఆమె ఇప్పుడు తొలిసారి తన బాబు ముఖాన్ని చూపించింది. ప్రస్తుతం సనాఖాన్ ఫ్యామిలీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్