Raju Yadav OTT: అఫీషియల్.. ఓటీటీలో గెటప్ శీను రాజు యాదవ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ప్రస్తుతం అటు వెండితెరను, బుల్లితెరను ఏలుతున్నాడీ స్టార్ కమెడియన్. స్టార్ హీరోల సినిమాల్లో హాస్యనటుడిగా నటిస్తోన్న గెటప్ శీను ‘రాజు యాదవ్' మూవీతో హీరోగా మారాడు. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ తోనే తన సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు.

Raju Yadav OTT: అఫీషియల్.. ఓటీటీలో గెటప్ శీను రాజు యాదవ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Getup Srinu Raju Yadav
Follow us
Basha Shek

|

Updated on: Jul 09, 2024 | 12:32 PM

‘జబర్దస్త్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో గెటప్ శీను కూడా ఒకరు. తన నటనతో, గెటప్పులతో బుల్లితెర కమల్ హాసన్ అని ప్రశంసలు పొందాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. మెగాస్టార్ చిరంజీవి సైతం పలు సార్లు గెటప్ శీను నటనపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అటు వెండితెరను, బుల్లితెరను ఏలుతున్నాడీ స్టార్ కమెడియన్. స్టార్ హీరోల సినిమాల్లో హాస్యనటుడిగా నటిస్తోన్న గెటప్ శీను ‘రాజు యాదవ్’ మూవీతో హీరోగా మారాడు. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ తోనే తన సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు. అయితే మే 24న థియేటర్లలోకి వచ్చిన రాజు యాదవ్ అంచనాలను అందుకోవడంలో తడ బడ్డాడు. ఎప్పటిలాగే గెటప్ శీను నటనకు ప్రశంసలు వచ్చిన సినిమా కథా, కథనంలోని లోపాలు ఆడియెన్స్ ను నిరాశపర్చాయి. దీంతో చాలా మంది ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు వీరి కోసమే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేస్తున్నాడు రాజు యాదవ్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లా ట్ ఫామ్ ఆహా గెటప్ శీను సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోరాజు యాద‌వ్ ఓటీటీ రిలీజ్‌ను ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను పోస్ట్ చేసింది. త్వ‌ర‌లోనే రాజు యాద‌వ్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు ఈ పోస్ట‌ర్‌లో వెల్ల‌డించింది. అయితే స్ట్రీమింగ్‌ తేదీ ఎప్పటి నుంచి అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

కృష్ణమాచారి తెరకెక్కించిన రాజు యాదవ్ సినిమాలో అంకికా కారత్ హీరోయిన్ గా నటించింది. నంద చక్రపాణి, రూపాలక్ష్మి, ఉన్నతి, ఉత్తర ప్రశాంత్, సంతోష్ రాజ్, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వరుణ్వి క్రియేషన్స్ పతాకంపై రాజేష్ కల్లేపల్లి ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, సురేష్ గెటప్ శీను సినిమాకు సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. రాజు యాదవ్ (గెటప్ శీను)‌ ముఖానికి ప్రమాదవశాత్తూ క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ అది కాస్తా వికటిస్తుంది. ఫలితంగా రాజు ముఖం నిత్యం నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. అదే సమయంలో అతనికి స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆమెకు హైదరాబాద్‌లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. అయితే ఆ తర్వాత స్వీటీ.. రాజుకు కొన్ని ఊహించని షాకులిస్తుంది. మరి చివరకు వీరి ప్రేమ కథ ఏమైందనేదే రాజు యాదవ్ సినిమా కథ.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

రాజు యాదవ్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు