AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 3: బిగ్‏బాస్ హౌస్‏లోకి అనుకోని అతిథి.. చూసుకోవాలి కదంటూ నెటిజన్స్ ఫైర్..

తాజాగా బిగ్‏బాస్ హౌస్ లో ప్రేక్షకులు పామును గుర్తించారు. గార్డెన్ ఏరియాలో నేలపై నల్లటి పాము వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లోకి పాము ఎలా వచ్చింది.. ? కంటెస్టెంట్స్ భద్రత కోసం నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss 3: బిగ్‏బాస్ హౌస్‏లోకి అనుకోని అతిథి.. చూసుకోవాలి కదంటూ నెటిజన్స్ ఫైర్..
Bigg Boss 3
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2024 | 9:28 PM

Share

హిందీలో బిగ్‏బాస్ రియాల్టీ షోకు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బుల్లితెరపై 17 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. దీంతో అటు ఓటీటీలోనూ బిగ్‏బాస్ షో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్‏బాస్ సీజన్ 3 నడుస్తోంది. అయితే తాజాగా బిగ్‏బాస్ హౌస్ లో ప్రేక్షకులు పామును గుర్తించారు. గార్డెన్ ఏరియాలో నేలపై నల్లటి పాము వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లోకి పాము ఎలా వచ్చింది.. ? కంటెస్టెంట్స్ భద్రత కోసం నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ వీడియోలో కంటెస్టెంట్ లవకేష్ కటారియా అకా లవ్ కటారియా సమీపంలోని పాము వెళ్తూ కనిపించింది. అయితే తన పక్కన నుంచి పాము వెళ్తున్నా అతడు చూసుకోకుండా అలాగే నేలపై కూర్చుని ఉన్నాడు. లవ్ కటారియా చేతులను సంకెళ్లతో కట్టేసి ఉండగా.. అతడి పక్కన నుంచే నల్లటి పాము వెళ్లింది. అయితే పాము వెళ్లడం అక్కడున్న ఏ కంటెస్టెంట్ కూడా పామును చూడకుండా తమ పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ షేర్ చేస్తూ బిగ్‌బాస్ హౌస్‌లో భద్రతా చర్యలపై అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అయితే, వీడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే, జియో సినిమా బృందం ఆ క్లిప్ ఎడిట్ చేశారంటూ స్పష్టం చేసింది. హౌస్ లోకి పాము రాలేదని.. కేవలం అది ఎడిట్ చేసిన వీడియో మాత్రమే అని తెలిపారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం