Trisha- Brinda: త్రిష తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఆసక్తిగా టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు సిద్ధం కావాల్సిందే. ప్రముఖ సీనియర్ హీరోయిన్ త్రిష నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘బృంద’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్

Trisha- Brinda: త్రిష తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఆసక్తిగా టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Trisha
Follow us

|

Updated on: Jul 09, 2024 | 11:17 AM

అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు సిద్ధం కావాల్సిందే. ప్రముఖ సీనియర్ హీరోయిన్ త్రిష నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘బృంద’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్‌ విడుదల కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో ఈ సీరీస్‌ విడుదల కానుంది. ఈ సందర్భగా సీరీస్‌ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల మాట్లాడుతూ ‘సోనీ లివ్‌’ ద్వారా ప్యాన్‌ ఇండియా ఆడియన్స్‌ని బృంద సీరీస్‌తో పలకరించడానికి నాకు థ్రిల్‌గా ఉంది. బృంద ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతుంది. అనూహ్యమైన మలుపులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. బృంద సీరీస్‌ చూస్తున్నంత సేపు ఆసక్తిగా, ఉత్కంఠ రేకెత్తించేలా ఉండటమే కాదు, తాము అప్పటిదాకా నమ్ముతున్న నమ్మకాల మీద కూడా ఫోకస్‌ పెరుగుతుంది. అత్యద్భుతమైన, శక్తిమంతమైన, ఫీమేల్‌ లీడ్‌ నెరేటివ్‌ స్టోరీతో తెరకెక్కింది బృంద. ఈ సీరీస్‌ని డైరక్ట్ చేయడం ఆనందదాయకం. కథానుగుణంగా బృంద పాత్రలో అత్యద్భుతమైన లేయర్స్ ని జనాలు విట్‌నెస్‌ చేస్తారు. త్రిషగారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటిదాకా ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పేలా ఉంటుంది” అని అన్నారు.

సూర్య మనోజ్‌ వంగాలా గ్రిప్పింగ్‌గా రాసి, అద్భుతంగా డైరెక్ట్ చేసిన సీరీస్‌ బృంద. టాలెంటెడ్‌ సౌత్‌ క్వీన్‌ త్రిష కృష్ణన్‌ ఈ సీరీస్‌తోనే ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య మనోజ్‌ వంగాలా, పద్మావతి మల్లాది కలిసి రూపొందించిన స్క్రీన్‌ప్లే ఈ సీరీస్‌కి హైలైట్‌ కానుంది. శక్తికాంత్‌ కార్తిక్‌ సంగీతం అందించారు. అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైన్‌ చేశారు. దినేష్‌ కె బాబు సినిమాటోగ్రఫీ ఈ సీరీస్‌కి హైలైట్‌ కానుంది. అన్వర్‌ అలీ ఎడిటింగ్‌ గురించి తప్పకుండా సీరీస్‌ చూసిన అందరూ ప్రస్తావిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది టీమ్‌. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, జయప్రకాష్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి, రాకేందు మౌళితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సీరీస్‌లో కీలక పాత్రల్లో నటించారు. డ్రామా, క్రైమ్‌, మిస్టరీ అంశాలతో… చూసినంత సేపూ ఒళ్లు గగుర్పొడిచేలా సాగుతుంది బృంద సీరీస్‌.

ఇవి కూడా చదవండి

* ప్రతి సెకనూ ఉత్కంఠ రేపే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ని చూడటానికి ఆగస్టు 2 వరకు ఆగాల్సిందే. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో సోనీ లివ్‌లో అందుబాటులో ఉంటుంది ‘బృంద’ సీరీస్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బడ్జెట్‌లో 9 రంగాలకు ప్రాధాన్యత: ఆర్థిక శాఖ మంత్రి
బడ్జెట్‌లో 9 రంగాలకు ప్రాధాన్యత: ఆర్థిక శాఖ మంత్రి
ఓ మై నెట్‏ఫ్లిక్సు.. టాలీవుడ్ హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంట్రా..
ఓ మై నెట్‏ఫ్లిక్సు.. టాలీవుడ్ హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంట్రా..
బడ్జెట్ ప్రసంగం ఇక్కడ లైవ్ వీక్షించండి
బడ్జెట్ ప్రసంగం ఇక్కడ లైవ్ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..
చారిత్రాత్మకంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. అంత స్పెషల్ ఏంటంటే?
చారిత్రాత్మకంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. అంత స్పెషల్ ఏంటంటే?
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు