ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. పెళ్లి రూమర్లతో తరచూ వార్తల్లో నిలిచే హీరో

సినిమాల సంగతి పక్కన పెడితే.. సిల్వర్ స్క్రీన్ పై ఊర మాస్ ఫైట్లు చేసే ఈ యాక్షన్ హీరో తరచూ పెళ్లి రూమర్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. అది కూడా తనతో కలిసి నటించిన హీరోయిన్లతోనే. అయితే అవన్నీ కేవలం పుకార్లు గానే మిగిలిపోయాయి. ఆ హీరయిన్లందరి పెళ్లిళ్లు అయిపోతున్నా అతను మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాగా  వార్తల్లో కనిపిస్తున్నాడు.

ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. పెళ్లి రూమర్లతో తరచూ వార్తల్లో నిలిచే హీరో
Tollywood Actor Childhood P
Follow us

|

Updated on: Jul 09, 2024 | 2:35 PM

పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తోన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. దక్షిణాది ఇండస్ట్రీలోనే ప్రముఖ యాక్షన్ హీరోగా మారిపోయాడు. పేరుకు కోలీవుడ్ హీరో అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతనికి చాలా మంది అభిమానులున్నారు. వీరి స్వస్థలం కూడా ఏపీనే. అందుకే తన సినిమా ఏది రిలీజ్ చేసినా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సిల్వర్ స్క్రీన్ పై ఊర మాస్ ఫైట్లు చేసే ఈ యాక్షన్ హీరో తరచూ పెళ్లి రూమర్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. అది కూడా తనతో కలిసి నటించిన హీరోయిన్లతోనే. అయితే అవన్నీ కేవలం పుకార్లు గానే మిగిలిపోయాయి. ఆ హీరయిన్లందరి పెళ్లిళ్లు అయిపోతున్నా అతను మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాగా  వార్తల్లో కనిపిస్తున్నాడు. ఈ మధ్యన పెళ్లెప్పుడు అని అడిగితే.. టాలీవుడ్ లో ప్రభాస్, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెళ్లిలయ్యాక చేసుకుంటానంటున్నాడు. దీంతో సదరు హీరో గారికి అసలు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ అబ్బాయి మరెవరో కాదు కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్.

విశాల్ సినిమాల సంగతేంటేమో కానీ.. ఈ మధ్యన తరచూ పెళ్లి రూమర్లతో వార్తల్లో నిలుస్తున్నాడు. విశాల్ మొదటి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. ఆ మధ్యన హీరోయిన్లు లక్ష్మీ మేనన్, అభినయలతో కూడా విశాల్ పెళ్లిని ముడి పెట్టారు. అయితే అవేవీ కార్య రూపం దాల్చలేదు. కాగ 2019లో హైద‌రాబాద్‌కు చెందిన అనీషా విల్లాతో విశాల్ నిశ్చితార్థం జ‌రిగింది. దీంతో తమ హీరోకు పెళ్లయిపోయినట్లేనని అభిమానులు భావించారు. కానీ ఉన్నట్లుండి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని ప్రకటించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే రత్నం అనే ఊరమాస్ సినిమాతో మరోసారి మన ముందుకు వచ్చాడు విశాల్. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తుప్పరివాలన్ 2 (డిటెక్టివ్ సీక్వెల్) సినిమాలో నటిస్తున్నాడీ యాక్షన్ హీరో.

ఇవి కూడా చదవండి

విజయ్ దళపతితో హీరో విశాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.