Vijay Devarakonda : శ్రీలంకలో విజయ్ దేవరకొండకు గ్రాండ్ వెల్‏కమ్.. ఎందుకు వెళ్లారంటే..

ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమాలో అర్జునుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. కల్కి చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు తిరిగి తన అప్ కమింగ్ మూవీస్ పై ఫోకస్ పెట్టాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

Vijay Devarakonda : శ్రీలంకలో విజయ్ దేవరకొండకు గ్రాండ్ వెల్‏కమ్.. ఎందుకు వెళ్లారంటే..
Vijay Deverakonda
Follow us

|

Updated on: Jul 09, 2024 | 2:53 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా రేంజ్‏లో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సౌత్ తోపాటు, నార్త్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమాలో అర్జునుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. కల్కి చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు తిరిగి తన అప్ కమింగ్ మూవీస్ పై ఫోకస్ పెట్టాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు వీడి12 వర్కింగ్ టైటిల్. తాజాగా ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న రౌడీ హీరోకు ఘనస్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో కథానాయిక ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వర్క్ చేయనున్నాడు. వీడీ 13 వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..
చారిత్రాత్మకంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. అంత స్పెషల్ ఏంటంటే?
చారిత్రాత్మకంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. అంత స్పెషల్ ఏంటంటే?
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..